28.7 C
Hyderabad
April 24, 2024 04: 15 AM
Slider నిజామాబాద్

పేదలు ఆత్మగౌరవంతో బ్రతికేలా డబుల్ ఇళ్ల నిర్మాణం

#MinisterVemulaPrasanthReddy

పేదలు ఆత్మగౌరవంతో బ్రతికేలా డబుల్ ఇళ్లను నిర్మిస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఉచితంగా పేదలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వడం లేదని తెలిపారు. ఈ ఘనత కేవలం సీఎం కేసీఆర్ కె దక్కిందని చెప్పారు.

కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామంలో 2 కోట్ల 52 లక్షలతో నిర్మించిన 40 డబుల్ బెడ్ రూమ్ ఇలాను గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. లబ్దిదారులతో కలిసి ఇళ్లలో పాలు పొంగించి గృహ ప్రవేశం చేయించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..  ప్రపంచమే అబ్బురపడేలా పేదలకు ఉచిత డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందించడం ద్వారా సీఎం కేసీఆర్ అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు. 2 కోట్ల 52 లక్షలతో 40 ఇళ్లను నిర్మించి పేదవారికి అందించడం గొప్ప విషయమని తెలిపారు.

ప్రపంచంలో ఎవరు చేయలేని ఆలోచన సీఎం కేసీఆర్ చేయడమే కాకుండా కార్యరూపం చేసి రాష్ట్రంలోని పేదలకు ఉచిత డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తున్నారని చెప్పారు. పేదలు ఆత్మగౌరవంతో ఉండే విధంగా నాణ్యతతో ఇళ్లను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రతి పేదకు ఇండ్లు వస్తాయి

కామారెడ్డి నియోజకవర్గంలో  17 వందల ఇల్లు మంజూరయ్యాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. లింగాయపల్లి గ్రామంలో 2కొట్ల 52 లక్షలతో నిర్మించిన 40 ఇళ్లను నేడు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మిగతా ఇళ్లను త్వరలో పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని తెలిపారు.

ప్రతి ఏటా అదనంగా ఇళ్ల మంజూరు చేసుకుని అర్హులైన పేదలకు ఇళ్ళు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్ కుమార్, జడ్పీ చైర్మన్ దఫెడర్ శోభ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముజీబొద్దిన్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు

Related posts

విద్యా విషయాలలో అందరికి సాయం చేస్తాం

Satyam NEWS

రిజర్వ్డ్:నిర్భయ కేసులోముగిసిన వాదనలుత్వరలోతీర్పు

Satyam NEWS

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం వెంటనే చేపట్టాలి

Satyam NEWS

Leave a Comment