28.2 C
Hyderabad
December 1, 2023 19: 21 PM
Slider ఆదిలాబాద్

డా.బి ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం నమూనా విడుదల

నిర్మల్ నియోజకవర్గం సారంగపూర్ మండలం లో చించోలి బి చౌరస్తా లో నూతనంగా ఏర్పాటు చేయనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం నమూనా చిత్రపటాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విడుదల చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఇలాంటి విగ్రహం మహారాష్ట్రలోని బీమా గోరేగంలో మరియు ఉత్తర ప్రదేశ్ లో మాత్రమే ఉన్నాయని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చించోలి బి చౌరస్తాలో అంబేద్కర్ గారి కూర్చున్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. ఈ విగ్రహాన్ని కొత్త మోడల్ గా రూ. 10 లక్షల 50 వేలు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విగ్రహానికి సంబంధించిన ఫౌండేషన్ రైలింగ్ పనులు అతి త్వరలో ప్రారంభిస్తామని అన్నారు.నిర్మల్ లో ఐదు కోట్ల తో అంబేద్కర్ భవనం, ధర్మసాగర్ కట్ట మీద గతంలో అతిపెద్ద కంచు విగ్రహం ఏర్పాటు చేశామని నిర్మల్ లో ఎస్సీ స్టడీ సర్కిల్ అతి త్వరలో ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వెంకట్ రాం రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, డాక్టర్ కృష్ణంరాజు, టీఎన్జీవో అధ్యక్షులు ప్రభాకర్, సీనియర్ దళిత సంఘ నాయకులు బొడ్డు లక్ష్మణ్ ,చించోలి బి సర్పంచ్ లక్ష్మీ రమేష్, ఎంపిటిసి వెంకట రమణ రెడ్డి, సారంగాపూర్ మండల అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు నాగయ్య, బుద్ధ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, జిల్లా దళిత చైతన్య సదస్సు కో కన్వీనర్ ముజ్జ రాజన్న, టిఆర్ఎస్ టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవర రఘు, నిర్మల్ బుద్ధ మహాసభ అధ్యక్షులు వెంకటస్వామి,బెబ్బులి ప్రసాద్,ముత్తన్న,సిద్ధ బబ్లు దౌడ సుభాష్ దాదాపు 200 మంది దళిత సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

యూపీఏ లేదన్న మమతాకు కాంగ్రెస్ గట్టి కౌంటర్

Sub Editor

మునుగోడు ఉప ఎన్నిక లో టీఆరెఎస్ విజయం

Murali Krishna

మూడు అంశాల చుట్టూనే ఆంధ్రా రాజకీయం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!