26.2 C
Hyderabad
October 15, 2024 12: 49 PM
Slider తెలంగాణ

కేంద్రం నిధులు దండుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

bjp-laxman-st

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కేంద్ర నిధులు రాష్టానికి పంపిస్తే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం దండుకుంటుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్  ఆరోపించారు. ప్రజా సంకల్ప సభ అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్  కొల్లాపూర్ బీజేపీ పార్టీ  కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ర్రాష్టాన్ని మూడు లక్షల కోట్లు అప్పుల పాలు చేశారన్నారు. ఇప్పుడు రాష్ట ఆర్టీసీ ఆస్తులు కరగదీస్తున్నారన్నారు.

ఆర్టీసీ ఆస్తులు అమ్మేస్తున్నందుకే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు.50 వేలమంది కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అని రోడ్ల పాలు చేశారన్నారు. దేశంలో 4లక్షల70 వేల రోడ్లు ప్రమాదాలు జరిగాయని ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువస్తే వక్రభాష్యం చెపుతున్నారని అన్నారు. తెలంగాణలో ఎత్తిపోతల ప్రాజెక్టులు అన్ని అక్రమమని ముఖ్యమంత్రి జన్మోహన్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారన్నారు.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు విప్పాలన్నారు. కొల్లాపూర్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక సోమశిల సిద్ధేశ్వర వంతెన జాతీయ రహదారి ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. మాదాసి మా దారి కురువ ప్రజల కు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు వచ్చేలాగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు  సుబ్బారెడ్డి వనపర్తి జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి,దిలిపచారి,ఇతర రాష్ట,జిల్లా నాయకులు కొల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ గౌడ్, జలాల్ శివుడు సందు రమేష్,ధనుంజయ గౌడ్ కాశీపురం మహేష్ ,రమేష్ రాథోడ్,పురేందర్, మెంటే శివకుమార్  తది తరులు పాల్గొన్నారు.

Related posts

కానిస్టేబుల్ అభ్యర్ధులకు ప్రభుత్వ శిక్షణ

Satyam NEWS

అభివృద్ధి సంక్షేమమే మా ప్రచారాస్త్రం

Sub Editor

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి

Bhavani

Leave a Comment