39.2 C
Hyderabad
March 29, 2024 13: 17 PM
Slider శ్రీకాకుళం

డా.మోహన్ కు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం

#Dr. Mohan

శ్రీకాకుళం పట్టణానికి చెందిన డా. గుండబాల మోహన్ మోహన్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా వ్యాయామ విద్యా చరిత్రలో తనకే ఈ మొదటి పురస్కారం లభించిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇప్పటికే తను పలు ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు, సాంకేతిక విద్యా కళాశాలలు, వ్యాయామ విద్య కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా, వ్యాయామ ఉపాధ్యాయుడు గా గత 16 సంవత్సరాలుగా పని చేశానని తెలిపారు.

వ్యాయామ విద్య అధ్యాపకుడిగా తాను చేసిన సేవలకు గుర్తింపుగా తనకు ఈ అత్యున్నత స్థాయి పురస్కారం లభించిందని తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ భారతదేశపు అధికారైన సంతోష్ శర్మ తనకు వర్చువల్ విధానం ద్వారా సర్టిఫికెట్ ప్రధానం చేశారని ఈ సందర్భంగా తెలిపారు. తనకు ఈ లభించిన ఈ పురస్కారం తల్లిదండ్రులైన శ్రీనివాసరావు సత్యవతి, ఒరిస్సా రాష్ట్రంలో గల బలియా పాల్ వ్యాయామ విద్యా కళాశాల ప్రిన్సిపాల్ డా.

శ్రీకాంత్ మిశ్రా, తాను ప్రస్తుతం పనిచేస్తున్న గురజాడ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ అంబటి రంగారావు లకు పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు, తనకు వచ్చిన ఈ పురస్కారం పట్ల తనకు చిన్నప్పుడు ఆటలపై ఆసక్తి గుర్తించి తను అన్ని విధాలుగా ప్రోత్సహించిన ఆనంద్ రావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ వ్యాయామ శిక్షకులు ఎల్.

దేవానందం, డా . శ్రీధర్, బడి శ్రీనివాసరావులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. తాను ఈ 16 సంవత్సరాల వ్యాయామ విద్యలో ఇప్పటికే ఎంతోమంది తన విద్యార్థులు జిల్లాస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయస్థాయిలో పోటీలలో పాల్గొని అనేక పథకాలను సాధించారని తెలిపారు.

Related posts

అభివృద్ధిలో తెలంగాణ టాప్: మంత్రి కేటీఆర్

Bhavani

జగన్ రాజకీయ చిత్రానికి సెన్సార్ కత్తెరలు

Satyam NEWS

ఇసుక ఎక్కువ రేటు చెబితే ఒక్క ఫోన్ చేయండి చాలు

Satyam NEWS

Leave a Comment