27.7 C
Hyderabad
April 25, 2024 10: 03 AM
Slider జాతీయం

డాక్టర్ రెడ్డీస్ షేర్ కు స్పూత్నిక్ వ్యాక్సిన్ దెబ్బ

#Dr.Reddys

స్పూత్నిక్ వ్యాక్సిన్ ఘోరంగా విఫలం కాబోతున్నదనే సమాచారం నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ షేర్లు పతనం దిశగా పయనిస్తున్నాయి. రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్, రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ లతో కలిసి డాక్టర్ రెడ్డీస్ ఈ కరోనా వ్యాక్సిన్ ను భారత్ లో పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

తొలి దశలో 100 మిలియన్ వ్యాక్సిన్ డోస్ లను రష్యా డైరెక్ట్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్ భారత్ కు సరఫరా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ కు చట్టబద్ధమైన అనుమతులు రావడానికి, మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ పూర్తి కావడానికి ఈ ఏడాది చివరి వరకూ పట్టవచ్చు.

రష్యా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ను భారత్ లో పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీ లేబెరెటరీ ఒప్పందం కుదుర్చుకుంది. చట్ట పరమైన అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాత రష్యా రూపొందించిన స్పూత్నిక్ వి వ్యాక్సిన్ ను డాక్టర్ రెడ్డీస్ భారత్ లో పంపిణీ చేస్తుంది.

అంతే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న క్లీనికల్ ట్రయల్స్ లో తన వంతు పాత్రను నిర్వర్తిస్తుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్, రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ లతో కలిసి డాక్టర్ రెడ్డీస్ ఈ బాధ్యతను స్వీకరించింది. ఒప్పందం కుదిరిన వార్త వెలువడటంతో డాక్టర్ రెడ్డీస్ షేర్ విపరీతంగా పెరగడం ప్రారంభమైంది.

శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి 5333.35 కు డాక్టర్ రెడ్డీస్ షేర్ ట్రేడ్ అయింది. సోమవారంనాడు షేర్ బిడ్ కేవలం 5210.10 మాత్రమే ఉంది. ఉదయం నుంచి డాక్టర్ రెడ్డీస్ షేర్ రెడ్ లోనే కొనసాగుతున్నది. స్పూత్నిక్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఏడుగురిలో ఒకరికి విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులతో బాటు ఇతర రోగ లక్షణాలు కనిపిస్తున్నాయని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించిన విషయం సత్యం న్యూస్ పాఠకులకు తెలిసిందే.

తొలి రెండు దశల ట్రయల్స్ ను దాటి మూడో దశ లోకి ప్రవేశించక ముందే రష్యా ప్రభుత్వం స్పూత్నిక్ వ్యాక్సిన్ కు లైసెన్సు మంజూరు చేసింది. చాలా దేశాలతో పంపిణీకి ఒప్పందం కుదుర్చుకోవడం ప్రారంభించింది. అలా రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న డాక్టర్ రెడ్డీస్ కు స్పూత్నిక్ వ్యాక్సిన్ పై వస్తున్న ప్రతికూల వార్తలు ప్రభావం చూపిస్తున్నాయి.

Related posts

రెవెర్స్:వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని భార్యహత్య

Satyam NEWS

తెలంగాణాలో 7వ శాఖను ప్రారంభించిన సానీ ఇండియా

Satyam NEWS

ఫ్లాష్ న్యూస్: ముగ్గురు వీరసైనికులను చంపేసిన చైనా

Satyam NEWS

Leave a Comment