27.7 C
Hyderabad
April 26, 2024 04: 55 AM
Slider హైదరాబాద్

సీజనల్ వ్యాధులు తరిమికొట్టే బాధ్యత మనందరిపై ఉంది

#ASRao Nagar Corporetor

రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం దోమలను తరిమికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఏఎస్ రావు డివిజన్ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి  కేటీఆర్ దీనికి సంబంధించి  ప్రత్యేక సూచన చేశారని ఆమె అన్నారు. అందరూ పది వారాల పాటు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఇంటిని శుభ్రం చేసుకోవాలి, పరిసరాలలో నీరు నిల్వ లేకుండా పూల కుండీలు శుభ్రం చేసుకోవాలని కేటీఆర్ సూచించారని కార్పొరేటర్ తెలిపారు.

ఈ మేరకు ముసినిపాలిటీ ఎంటమాలజీ శాఖ వారిచే కార్పొరేటర్  కమలానగర్  లోని వివిధ అపార్ట్మెంట్ లలో  అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాలు, గార్డెన్ ‌ తదితర ప్రాంతంలో ఎక్కడా నీరు నిల్వలేకుండా చేసి దోమల మందు పిచికారి చేయాలని ఎంటమాలజీ వారు సూచించారు.

ఇళ్లలోని పాత కూలర్లు, టైర్లు, పాతబడిన వస్తువుల్లో నీరు నిలబడకుండా‌ చేయాలన్నారు. దోమలపై యుద్దం చేద్దామని కార్పొరేటర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఎంటమాలజీ  సిబ్బంది సూపర్ వైజర్ నరేంద్ర రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మాజీ ఎంపీపీ దశదిన కర్మ కు హాజరైన నాయకులు

Satyam NEWS

మద్యం అమ్మాలని ప్రధాని మోడీ చెప్పలేదు

Satyam NEWS

Target Satyakumar: తమ నీడను చూసి తామే భయపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

Leave a Comment