27.7 C
Hyderabad
April 19, 2024 23: 30 PM
Slider ముఖ్యంశాలు

నాలా విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉంది

#talasani

హైదరాబాద్ అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలోని మోయిన్ చెరువు నుంచి ఎస్టిపి వరకూ ఉన్న నాలా విస్తరణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు పరిశీలించారు. నూతన నాలాను నిర్మించేందుకు రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల మంత్రి కేటీఆర్ సుమారు 22 కోట్ల రూపాయలు మంజూరు చేశారు.

సోమవారం నాలా పరివాహక ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించగా ఆయనతో బాటు అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే  కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్, కమిషనర్, నాలా ప్రాజెక్టు అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాలా విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉన్నదని, వెంటనే పనులను ప్రారంభించి వర్షాకాలం వచ్చేలోపు త్వరితగతిన నాలా విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, నాలా ప్రాజెక్టు అధికారులు, డీసీ వేణుగోపాల్, వాటర్ వర్క్స్ డిజిఎం సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి సాయిబాబా, డీఈ సుధాకర్, డీఈ సువర్ణ, ఎఈ కుషాల్, ఎఈ శ్వేత, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు

Satyam NEWS

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవికి పెరుగుతున్న మద్దతు

Satyam NEWS

బిచ్చుంద మండలంలో రంజాన్ కానుకలు పంపిణీ

Satyam NEWS

Leave a Comment