అదొక ప్రముఖ టీవీ ఛానల్ అట. వాళ్లు ఇప్పుడు యాంకర్ లెస్ ఛానల్ గా మారి తెలుగులో వార్తలు ప్రెజంట్ చేయాలని నిర్ణయించుకున్నారట. చేసుకోమను అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదు. అందుకు తగిన సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. మరీ సంతోషం. సరే అంతవరకు బాగానే ఉంది .. ఒకే !
అయితే ప్రత్యర్థి ఛానల్స్ ను దెబ్బ తీసేదెలా…అని కూడా ఆలోచించినట్లున్నారు. అనుకున్నదే తడవుగా పత్రికలలో ఫుల్ పేజీ యాడ్ రిలీజ్ చేసేసారు. అక్కడే పప్పులో కాలేసారు. అప్పటివరకు అంతంత మాత్రంగా ఉన్న వారిని ఒక్కసారి హీరోలను చేసేసారు. టీఆర్పీ రేటింగ్ లను సైతం పెంచేసారని చెప్పుకోడానికి అప్పనంగా అవకాశం కూడా ఇచ్చేసారని ప్రత్యర్థులు వాపోతున్నారట!
” మీ ప్రోగ్రామ్ ఇక ఎవరు చూస్తారు ? ఇక ఆపండి సార్ ! అరుపులు ఇంకెంత కాలం! ” అనే వ్యాఖ్యలతో ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. … అయితే వీళ్లేం తక్కువ తిన్నారా! తమ పేర్లతో సహా పేపర్ల లో రాసి ‘ యాడ్ ‘ ద్వారా తమ ప్రతిష్ట ను దిగజార్చారనే ఆరోపణలతో పరువు నష్టం దావా వేయబోతున్నట్లు వినికిడి.
అయితే లోలోపల మాత్రం ఈ ప్రకటన వల్ల తమకు జరిగే నష్టం కంటే లాభమే ఎక్కువ అని ఈ ముగ్గురు సంబరపడుతున్నట్లే అనిపిస్తోందని వీక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా యాంకర్ అవసరం లేని వార్తలు చూసేందుకు మన తెలుగు ప్రజలు ఇంకా సిద్ధంగా లేరని..మరి కొంత కాలం ఈ బాధ భరించక తప్పదని అంటున్నారు.
ఏది ఏమైనా రాజకీయ నాయకులు దిగజారి ఒకరి నొకరు తిట్టుకోవడం చూశాం. తెలంగాణలో సన్నాసులు అనే తిట్టుదగ్గరే రాజకీయ నాయకులు ఆగిపోగా ఏపిలో అయితే లఫూట్ లు, లుచ్ఛాలూ నా..డకా వరకూ వెళ్లారు.
ఇప్పుడు టివి జర్నలిస్టులు కూడా ఈ స్థాయిలో తిట్టుకోవడం మొదలు పెట్టపోతున్నారన్నమాట. పరమ ఛండాలం… అపర దరిద్రం.. ఇదా జర్నలిజం? ఇలాంటి వె… లు ఛానెళ్లు పెట్టి ఈ సమాజాన్ని మరింత ఛండాలం చేయడం తప్ప ఇంకేదైనా సాధిస్తారా? ఎవడు ఎలా ఏడుస్తున్నాడో అని చెప్పి మనమెందుకు ఏడవడం. మన ఏడుపేదో మనం ఏడవాలి కదా.