హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలోని ఎంసిహెచ్ కాలనీలో పనిచేయని పవర్ బోర్ లని స్థానికులతో కలిసి అంబర్పేట్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులను పిలిచి వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే మరమ్మతులు చేయవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు రంగు సతీష్ గౌడ్, మక్బుల్ భాయ్,సూరజ్, రఫిక్, ఆశీర్వాదం,అవినాష్, , సయ్యద్ యూసుఫ్ బాబా, రంగు ఉదయ్ గౌడ్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.