33.2 C
Hyderabad
April 26, 2024 01: 06 AM
Slider నల్గొండ

మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్సులు రద్దు

#Nalgonda CI

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఏడుగురు వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్సులను రెండు నెలల పాటు రద్దు చేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు నల్లగొండ ట్రాఫిక్ సిఐ దుబ్బ అనిల్ కుమార్ తెలిపారు.

తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 15 మంది వ్యక్తులను సోమవారం జిల్లా రెండవ తరగతి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా ఎనిమిది మందికి 2,500 రూపాయల చొప్పున, మరో ఏడుగురు వ్యక్తులకు రెండు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయడంతో పాటు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణం కావద్దని, రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందిన వ్యక్తి కుటుంబం రోడ్డున పడుతున్న పరిస్థితులు అందరూ గమనించాలని కోరారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే సహించబోమని, జరిమానాలు, జైలు శిక్షలతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్సులు సైతం రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

వాహనదారులంతా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, నిబంధనలు పాటిస్తూ పోలీసులతో సహకరించాలని సిఐ అనిల్ కుమార్ కోరారు.

Related posts

ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవ‌తారోత్స‌వాలు

Satyam NEWS

గ్రీవెన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత

Bhavani

మరణించిన పోలీసుల కుటుంబాలకు చెక్కులను అందజేసిన ఎస్పీ

Murali Krishna

Leave a Comment