కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడ్ గ్రామ శివారులో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న పదిమంది మందు బాబులను పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో పట్టుకున్నారు. పట్టుబడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ కు చెందిన టి శ్రీకాంత్, జి లక్ష్మణ్, యం రంజిత్, బొమ్మకల్ కు చెందిన జి లకేష్, పెద్దపల్లి కి చెందిన కే రాజేష్, దుర్షేడ్ చెందిన వి సాయి, టి వేణు, ఎం వంశీ, మానకొండూరు కు చెందిన కే రాకేష్, వికారాబాద్ కు చెందిన కే సాయి కిరణ్ లు పట్టుబడ్డారు. వీరిని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
previous post
next post