35.2 C
Hyderabad
April 24, 2024 12: 56 PM
Slider ఆదిలాబాద్

లాక్ డౌన్ ఉల్లంఘనలపై డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా

nirmal police 191

కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన కరోన లాక్ డౌన్ ను విఘాతం కల్గిస్తు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు.

నిర్మల్ పట్టణంలో కరోనా వ్యాధి నివారణకు లాక్ డౌన్ మరింత పకడ్బందీగా నిర్వహించడానికి, డ్రోన్ కెమెరా సహాయంతో నిర్మల్ పట్టణములో ఉన్న ఐదు జోన్ లు  జోహ్రానగర్, చిక్కడపల్లి, గుల్జార్ మజీద్ ప్రాంతం, బుధవార్ పెట్, గాజులపెట్ ప్రాంతాలను నిర్మల్ పట్టణ పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన లాక్ డౌన్ కు పట్టణ ప్రజలు జిల్లా పోలీసు సిబ్బందికి సహకరిస్తున్నారని, కానీ కొందరు ఈ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనవసరంగా ఇంట్లో నుండి బయటకు వెళ్లి రోడ్లపైకి వస్తున్నారని అన్నారు.

నిర్మల్ పట్టణం రెడ్ జోన్ క్రింద వస్తుందని, అలాగే వైద్య పరంగా అత్యవసర పరిస్థితులు ఉన్నపుడే మాత్రమే బయటకు రావాలని ఆయన అన్నారు. అంతేకాని పని లేకున్నను అనవసరముగా గుమిగూడినా లేదా లేదా ద్విచక్ర వాహనాలతో బయటికి వచ్చిన ఆ వాహానాలను సీజ్ చేస్తామన్నారు.

పెద్ద రోడ్లే కాకుండా చిన్న చిన్న గల్లిలలో కూడా డ్రోన్ కెమెరాను ఉపయోగింఛి ఎవరైనా అనవసరంగా తిరిగితే వెంటనే తదుపరి చర్యలు చేపడతామని, సీజ్ అయిన వాహనాలు లాక్ డౌన్ పూర్తి అయ్యేంత వరకు వదులవద్దని పోలీసు అధికారులను ఆదేశించారు.

అలాగే ప్రజలు ఇండ్లల్లో నుండి బయటకు వచ్చి పేకాట ఆడిన, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఈ డ్రోన్ కెమెరాతో గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డి.యస్.పీ. ఉపేంద్ర రెడ్డి, నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ జాన్ దివాకర్, ఐ.టి. కోర్ ఇంచార్జి షేక్ మురాద్ అలీ పాల్గొన్నారు.

Related posts

వామపక్షాల అభ్యర్ధి గెలుపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మలుపు

Satyam NEWS

జాతీయ ఓటర్ల దినోత్సవానికి అధికారులు హాజరు కావాలి

Satyam NEWS

ఓ కారు ఓ బైకు ఓ అనధికార మున్సిపల్ ఉద్యోగి

Satyam NEWS

Leave a Comment