32.2 C
Hyderabad
March 29, 2024 21: 22 PM
Slider శ్రీకాకుళం

బడిబయట విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించాలి….

#SchoolDroopOuts

బడి బయట ఉన్న విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించే కార్యక్రమాన్ని శ్రీకాకుళం    సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి ఏ. పీ . ఓ. సుధాకర్ ప్రారంభించారు.

శ్రీకాకుళం పట్టణంలో స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఉదయం  క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లు, సమగ్ర శిక్ష ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆర్ట్ , క్రాఫ్ట్ , వ్యాయామ ఉపాధ్యాయుల ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఏప్రిల్ ఒకటో తారీకు వరకు బడిబయట ఉన్న విద్యార్థులను వారి డేటాను సేకరించి తిరిగి వారిని బడిలో చేర్పించే కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మండలం విద్యాశాఖాధికారి జీ. కృష్ణారావు, సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఎం. ఐ. ఎస్. కోఆర్డినేటర్ ఎస్ . గౌరీశంకర్, సి. ఆర్. పి . కె  రామకృష్ణ,   వ్యాయామ ఉపాధ్యాయుడు గుండబాల మోహన్, శ్రీకాకుళం మండలంలో పనిచేస్తున్న సీ. ఆర్పీ. లు, ఆర్ట్ , క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ధాన్యం కొనుగోలులో ఇబ్బంది రానివ్వం

Murali Krishna

మంచి మాట చెప్పి బాట చూపిన మహనీయులు

Satyam NEWS

ఏకాగ్రతతో చదివి ఉన్నతంగా ఎదగాలి

Bhavani

Leave a Comment