33.2 C
Hyderabad
April 26, 2024 02: 47 AM
Slider ఆదిలాబాద్

డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయాల్సిందే… !

#MPBandiSanjay

డ్రగ్స్ దందాలో కేసీఆర్ కుటుంబానికి లింకు ఉందని 5వ విడతపాదయాత్రలో నిర్మల్ లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆరోపణ చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ విచారణకు పోతే అరెస్ట్ చేస్తారని కేసీఆర్ బిడ్డకు భయం పట్టుకుందని..అందుకే విచారణకు వెళ్లకుండా కొత్త డ్రామాలకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని తెలంగాణ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ మాట్లాడుతూ నీ ప్రభుత్వాన్ని కూల్చాలంటే 57 మంది ఎమ్మెల్యేలు కావాలి…బీజేపీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే… అదెలా సాధ్యం?..
37 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని కూల్చింది నువ్వు..

తెలంగాణ ప్రజల ఆశలను కూల్చింది నువ్వు…

కంత్రీ మంత్రి…నీ అవినీతి, కబ్జాల చిట్టా ఉంది… పిచ్చపిచ్చగ మాట్లాడితే అంతు చూస్తాం అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు.

హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసులను తక్షణమే రీ ఓపెన్ చేసి విచారణను వేగవంతం చేయాలని బండి సంజయ్ కుమర్ డిమాండ్ చేశారు. ఈ కేసులు కేసీఆర్ కుటుంబానికి లింకు ఉందని అన్నారు. ఈ కేసును వెంటనే రీఓపెన్ చేసి విచారణ జరిపి దోషులను నడిబజార్లో నిలబెట్టాలని దర్యాప్తు సంస్థలను కోరారు. ఎమ్మెల్సీ కవిత రేపు జరగబోయే సీబీఐ విచారణకు హాజరుకావడం లేదని చెప్పడంపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘లక్ష కోట్లతో లిక్కర్ దందా చేసిన కేసీఆర్ బిడ్డ విచారణకు పోతే సీబీఐ అరెస్టు చేస్తుందనే భయం పట్టుకుంది. అందుకే తండ్రీబిడ్డలు కూర్చుని ఒకళ్లను పట్టుకుని ఒకళ్లు ఏడుస్తున్నరు. అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి కొత్త డ్రామాలు స్టార్ట్ చేశారు. ఒకవేళ అరెస్ట్ అయితే సానుభూతి కోసం స్కెచ్ వేస్తున్నరు. తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే కుట్ర చేస్తున్నరు. తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలే. లిక్కర్ దందాలో కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేస్తే మీరెందుకు ధర్నాలు చేయాలే’’అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ కుట్ర చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందట… కేసీఆర్…ఎందుకీ అర్ధం పర్ధం లేని మాటలు?

బీజేపీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే. నీ ప్రభుత్వాన్ని కూల్చాలంటే 57 మంది ఎమ్మెల్యేలు కావాలి. కూల్చడం సాధ్యమా? అయినా నీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేందుకు? తెలంగాణ ప్రజల ఆశలను కూల్చింది నువ్వే. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూల్చినవ్…తెలంగాణ ప్రజలే నీ ప్రభుత్వాన్ని కూలుస్తారు అని అన్నారు. అల్లుడు కబ్జాలకు… అంతే లేదని..మంత్రి పై విచారణ జరపాల్సిందేనని.. విడిచిపెట్టే ప్రసక్తే లేదని గట్టిగా చెప్పారు… బండి సంజయ్.

Related posts

వరుపుల రాజా మృతి పార్టీకి తీరనిలోటు

Satyam NEWS

వీడ్ని మనిషి అందామా? వేరే పేరు పెడదామా?

Satyam NEWS

Analysis: జీతం కోసం కాదు జీవితం కోసం చదువు

Satyam NEWS

Leave a Comment