39.2 C
Hyderabad
March 29, 2024 15: 17 PM
Slider ప్రత్యేకం

కరోనా రోగులకు శుభవార్త: కొత్త మందు వచ్చేసింది

#antiviraldrug

డిఆర్ డిఓ కు చెందిన న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎల్లైడ్ సైన్సెస్ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ తో కలిసి సంయుక్తంగా రూపొందించిన కరోనా మందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (జీసీజీఐ) అత్యవసర అనుమతులు మంజూరు చేసింది.

కరోనా పీడితులకు ఈ మందును నీటిలో కలిపి తాగిస్తే సరిపోతుంది. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. ఈ మందు కరోనా వైరస్ ఉన్న కణజాలంలోకి చొచ్చుకు వెళుతుంది. అక్కడ వైరస్ పెరుగుదలను అరికట్టి సమూలంగా నాశనం చేస్తుంది.

వైరస్ కణాల విభజనను, శక్తి విడుదలను అడ్డుకోవడం ద్వారా ఈ మందు వాటిని చంపేస్తుందని. 2 డాక్సీ డీ గ్లూకోజ్ (2డిజీ) పేరుతో పిలిచే ఈ మందును ఇప్పటికే పలువురు కరోనా వ్యాధిగ్రస్తులపై ప్రయోగించారు.

వారిలో మంచి ఫలితాలు వచ్చినట్లు వెల్లడి అయింది. ఈ మందు ఒక జనరిక్ మాలిక్యూల్ (కణజాలం), గ్లూకోజ్ నుంచి వేరు చేసిన ఎనలాగ్. దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు.

దేశంలోని పలు ప్రాంతాలలో ఈ మందును అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మందును నీటిలో కలుపుకుని తాగడం వల్ల కరోనా నుంచి వేగంగా కోలుకునే అవకాశం ఉంది.

ఈ మందు వాడటం వల్ల కరోనా రోగులు వేగంగా కోలుకోవడమే కాకుండా ఆసుపత్రిలో ఉన్నంత కాలం ఆక్సిజన్ సరఫరా చేయాల్సిన అవసరం కూడా అంతగా ఉండదు.

అంటే ఆక్సిజన్ చాలా తక్కువ మొత్తంలోనే అవసరం అవుతుంది. ఈ మందు వాడిన పేషంట్లకు అనతి కాలంలోనే ఆర్టీ పీసీఆర్ నెగెటీవ్ వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

గత ఏడాది ఏప్రిల్ నెలలో డిఆర్ డిఓ శాస్త్రవేత్తలు హైదరాబాద్ లోని సిసిఎంబి తో కలిసి పరిశోధనలు నిర్వహించగా ఈ మందు మంచి ఫలితాలను ఇచ్చినట్లు వెల్లడి అయింది.

Related posts

పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వ‌ర్క‌ర్ల కృషి మ‌రువ‌లేనిది

Satyam NEWS

సామాన్యుల నడ్డి విరిస్తున్న మోడీ ప్రభుత్వం

Satyam NEWS

కారు ప్రమాద మృతురాలికి పరిహారం అందచేత

Satyam NEWS

Leave a Comment