33.2 C
Hyderabad
April 25, 2024 23: 41 PM
Slider విజయనగరం

No Drugs: మత్తులో ఉంటే యువత జీవితం చిత్తు చిత్తు

#Vijayanagarap Police

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచీ 22 వరకు ఏంటీ డ్రగ్స్ ఇరాడికేషన్ డే ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో జిల్లా పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల నివారణా వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని మయూరీ జంక్షన్ నుంచీ బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీ జరిగింది.

తొలుత మయూరీ జంక్షన్ వద్ద కాలేజీ విద్యార్థులు, మహిళా సంరక్షణ పోలీసులనుద్దేశించి ఎస్పీ రాజకుమారీ మాట్లాడారు.మాదక ద్రవ్యాల అలవాటు ఏ ఒక్కరికీ ఉండకూడదన్నారు.ఓ మత్తులో పడి ముఖ్యంగా యువత తమ ఉజ్వల భవిష్యత్ సర్వ నాశనం చేసుకుంటున్నారని ఎస్పీ అన్నారు.

ఈ వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని ఈ వాటి నిర్మూలన ధ్యేయంగా జిల్లా పోలీసు శాఖ ఈ ర్యాలీ చేపట్టిందన్నారు. జిల్లాలో ఎలాంటి మత్తు పదార్థాలు గాని మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నట్టు తెలిసిన తమ వాట్సాప్ నెంబర్ కు కానీ పోలీసు శాఖ కు చెప్పొచ్చన్నారు.

అనంతరం మయూరీ జంక్షన్ నుంచీ బాలాజీ జంక్షన్ వరకు జరిగిన ర్యాలీ లో ఎస్పీ పాల్గొన్నారు. అక్కడ నుంచీ విజయనగరం డీఎస్పీ ,అనిల్ కుమార్ ,ఏఆర్ డీఎస్పీ అనిల్ కుమార్ నేతృత్వంలో బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది.అక్కడ ఎంఎస్పీ‌ ,కళాశాల విద్యార్ధినీ ,విద్యార్థులచే మానవహారం జరిగింది.

ఈ సందర్భంగా ఏఆర్ డీఎస్పీ శేషాద్రి మాట్లాడుతూ… మత్తు పదార్థాలకు ఎవ్వరూ బానిసలు కావొద్దని…వాటి విక్రయాన్ని అరికట్టేందుకే ఎస్పీ మేడం ఈ ర్యాలీ నిర్వహించారని తెలిపారు.

ఈ ర్యాలీ లో సీఐలు మురళీ ,శ్రీనివాసరావు, మంగవేణి ,ఎస్ఐ లు కిరణ్ ,బాలాజీ ,ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు, ఏఎస్ఐ నూకరాజు, హరి ఏఆర్ ఏఎస్ఐ గోవిందరావు ,నారాయణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రైతును బెదిరించిన వినుకొండ ఎమ్మెల్యేపై చర్య తీసుకోండి

Satyam NEWS

పెండింగ్ పనులపైనే నా దృష్టి…!

Satyam NEWS

వెన్నెల రేడు

Satyam NEWS

Leave a Comment