28.2 C
Hyderabad
March 27, 2023 10: 35 AM
Slider ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల‌కు డ్రగ్స్ విక్ర‌యిస్తున్న ముఠా గుట్టురట్టు

drug rocket

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో డ్రగ్స్ రాకెట్స్ విచ్చలవిడిగా తమ దందా కొనసాగిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా విజయవాడలో డ్రగ్స్‌ విక్రయించే ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టుచేశారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని సంపన్న కుటుంబాలకు చెందిన యువతీ, యువకులతో పాటు ప‌లు క‌ళాశాల‌ల‌కు చెందిన విద్యార్థులే ల‌క్ష్యంగా చేసుకుని వారికి దొడ్డిదారిన డ్రగ్స్ సర‌ఫ‌రా చేస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ హర్షవర్ధన్‌ రాజు శ‌నివారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో వెల్లడించారు. డ్రగ్స్‌ ముఠా నుంచి 14 గ్రాములు డ్రగ్స్‌, రెండ్నుర కిలోల గంజాయి, 8 సెల్‌ఫోన్లు, ఒక ద్విచ‌క్ర వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ముఠా కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడికి చేసి అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన వారిలో సూడాన్‌ దేశానికి చెందిన మహమ్మద్‌ గహేల్‌ రసూల్‌, టాంజానియా దేశానికి చెందిన లీశ్వ షాబాని ఉన్నారు. ముఠాలో అనంతకుమార్‌, శ్రీకాంత్‌ కీలకమైన వ్యక్తులుగా డీసీపీ పేర్కొన్నారు. ఈ ముఠా బెంగళూరులో రూ.2వేలు నుంచి రూ.2,500కు డ్రగ్స్‌ కొనుగోలు చేసి ఇక్కడ రూ.4వేల‌కు విద్యార్థులు విక్రయిస్తున్నారు. ఈ ముఠాపై గత కొంతకాలంగా నిఘా ఉంచామని ప‌క్కా స‌మాచారంతో రెడ్‌ హ్యాండెడ్‌గా డ్రగ్స్‌తో పట్టుకున్నామని తెలిపారు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల కదలికలపై దృష్టి సాధించాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రగ్ కల్చర్‌ని విజయవాడలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని దీనిపై కళాశాలల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీసీపీ స్పష్టం చేశారు

Related posts

పొన్నపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన కాసు వెంకట కృష్ణారెడ్డి

Satyam NEWS

డిసెంబర్ 20న మాస్ మహారాజ చిత్రం విడుదల

Satyam NEWS

అవసరార్ధులకు సేవ చేయడమే మాధవ సేవ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!