సినీ నటులంతా డ్రగ్స్ వల్ల బాధితులే తప్ప నేరస్తులు కాదని సెట్ అధికారులు చివరికి తేల్చారు. కలకలం రేపిన డ్రగ్స్ కేసులో ఇప్పటికే సిట్ చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఇంత వరకు కోర్టుకు మాత్రం డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక చేరలేదు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు క్లీన్ చిట్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులంతా బాధితులుగానే పేర్కొన్నారని తెలిసింది. గతంలో కూడా ఇలాంటి వార్తలే రాగా వాటిని ఎక్సైజ్ శాఖ, సిట్ అధికారులు ఖండించారు. తాము ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పారు. తాజాగా చార్జిషీట్ దాఖలు చేయగా అందులో బడా బడా సినీ స్టార్లను బాధితులుగానే చేర్చినట్లు తెలిసింది. ఈ కేసు గత మూడు సంవత్సరాలుగా సాగుతూనే ఉంది.
previous post