హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని పలు పబ్బుల్లో నార్కొటిక్స్ పోలీసులు ఆదివారం రాత్రి సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని జొరా పబ్‌లో తనిఖీలు చేయగా నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిది. దుర్గం చెరువులోని ఆలివ్ బిస్ట్రో పబ్‌లో కూడా సోదాలు చేయగా మొత్తం 11 మంది డ్రగ్స్ సేవించినట్లు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పబ్బులోని ఓ ఈవెంట్ లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో 11 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు వారికి పాజిటివ్ గా తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
previous post