32.7 C
Hyderabad
March 29, 2024 12: 44 PM
Slider ప్రపంచం

పాకిస్తాన్‌కు దుబాయ్ షాక్ .. కాశ్మీర్‌‌లో భారీ పెట్టుబడులు

కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ ముస్లిం దేశాల మద్దతును కూడగట్టుకోలేకపోయింది. ఈ విషయంలో భారత్ పాక్ పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. ముస్లిం దేశాలు పాకిస్తాన్ కు ఏమాత్రం మద్దతు ఇవ్వకుండా చేయడంలో దౌత్యపరంగా భారత్ విజయం సాధించింది.

ఇప్పుడు దుబాయ్ భారతదేశానికి అనుకూలంగా ప్రధాన నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా దుబాయ్ పాకిస్థాన్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. దుబాయ్ కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. మౌలిక సదుపాయాల నిర్మాణానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పరిపాలన- దుబాయ్ మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి.

ఒప్పందం ప్రకారం, దుబాయ్ ఐటీ టవర్లు, ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్స్ టవర్లతో పాటు మెడికల్ కాలేజీలు, హాస్పిటల్‌లను కశ్మీర్‌లో నిర్మించనుంది. కాశ్మీర్ అభివృద్ధికి ప్రపంచం మాతో పాటు వస్తోందని కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

Related posts

ట్రావెల్స్ బస్సు బోల్తా

Murali Krishna

25 నుంచి తెలంగాణా ప్రీమియర్‌ గోల్ఫ్‌ లీగ్‌ సీజన్‌ 2 ప్రారంభం

Satyam NEWS

బిజీ షెడ్యూల్లో కూడా 25 ఫిర్యాదులను స్వీకరించిన విజయనగరం ఎస్పీ

Satyam NEWS

Leave a Comment