28.2 C
Hyderabad
April 20, 2024 13: 58 PM
Slider నల్గొండ

పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాల పంపిణీ

#durgaidol

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో దుర్గా మాత విగ్రహాల బహుకరణ కార్యక్రమం సెప్టెంబర్ 25 ఆదివారం కన్నుల పండుగలా జరిగింది. ఈ సందర్భంగా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇన్చార్జి కుక్కల వెంకన్న మాట్లాడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పిల్లల నుంచి పెద్దల వరకు కలిసిమెలిసి చేసుకునే బతుకమ్మ సంబరాలు మొదలు కానున్నాయని తెలిపారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 25 ఆదివారం ప్రారంభమై అక్టోబర్ 5 బుధవారం వరకు జరుగుతుందని,మహిళలు,యువతులు, బాలికలకు ఎంతో ఇష్టమైన ఈ పండుగలో తొలి రోజు ఎంగిలి పూవ్వు బతుకమ్మను నిర్వహిస్తారని,ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండగ వచ్చి భూమి,మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటారని అన్నారు.

బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిదిరోజుల పాటు ఆటపాటలతో పూలను నీటిలో వదులుతారని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలను 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని వెంకన్న తెలియజేశారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

విజ‌య‌న‌గ‌రంలో రాజా సాహెబ్ పీవీజీ రాజు వ‌ర్దంతి…!

Satyam NEWS

కీలక కేసుల్లో క్వాలిటీ ఇన్ వెస్టిగేషన్ ఉండాలి

Satyam NEWS

జియోటెక్నికల్, స్ట్రక్చరల్  ఇంజనీరింగ్‌లో పురోగతిపై కార్యశాల

Satyam NEWS

Leave a Comment