39.2 C
Hyderabad
April 25, 2024 15: 43 PM
Slider ఆధ్యాత్మికం

ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన సమయాల పెంపు

#dwaraka tirumala

కోవిడ్ లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి (చిన్నతిరుపతి)వారి దేవస్థానంలో దర్శన సమయాలను సవరించారు. ఈ నెల 11 నుండి స్వామివారిని దర్శించుకునే సమయం ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించామని దేవస్థానం ఈఓ జి వి సుబ్బారెడ్డి తెలిపారు.

భక్తులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి దర్శనం పొందగలరని ఆ ప్రకటనలో కోరారు. స్వామివారి సన్నిధికి రాలేనివారి కోసం దేవస్థానం ఆన్లైన్ లో స్వామివారి సేవల కోసం నిర్ణయించబడిన సేవా రుసుము ఆన్ లైన్ లోనే చెల్లించి ఆన్ లైన్ లొనే పరోక్షంగా వెంకటేశ్వర స్వామివారిని దర్శించ వచ్చని తెలిపారు.

అంతే కాకుండా ఆన్ లైన్ ద్వారానే దేవస్థానం నందు ప్రతిరోజూ జరిగే వివిధ రకాలైన పూజా కార్యక్రమాలలో భక్తులు ప రోక్షంగా పాల్గొనవచ్చని అన్నారు. ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొనే భక్తులు ఆన్ లైన్  చెల్లించ వలసిన రుసుములను దేవస్థానం ఈ క్రింది విధంగా ప్రకటించింది.

1అష్టోత్తర నామార్చన పూజ కు 300 రూ పాయలు చెల్లిస్తే ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు ఈ పూజను జరిపిస్తారు.

2.స్వర్ణ తులసి దళార్చన ఈ పూజకు 1.116 రూపాయలు చెల్లిస్తే ఉదయం 7.30 నుండి 8గంటల వరకు పూజను జరిపిస్తారు.( ప్రతి బుధవారం మాత్రమే)

3. అమ్మవార్ల వద్ద కుంకుమార్చన కు 116 రూపాయలని ఉదయం 8 నుండి 11 .30 వరకు ఉంటుంది

4. స్వామివారి ఆర్జిత బ్రహ్మోత్సవం కు 516 రూపాయలు ఉదయం 8 నుండి 8.30 వరకు

5. స్వామివారి నిత్యార్జిత కళ్యాణం కు 1600 రూపాయలు. ఈ పూజ ఉదయం 9 నుండి11.30 గంటల వరకు ఉంటుంది. ఈ పూజ చేయించుకున్న వారికి పోస్టల్ ద్వారా ఉచితంగా వస్త్రాలు పంపబడతాయని తెలిపారు.

6. గోపూజ కు 116 రూ. నిర్ణయించారు ఉదయం 7.30 నుండి 11.30 వరకు ఉంటుంది.

7. గరుడోత్సవం శేషవాహన సేవ ఈ పూజకు 1000 రూపాయలు గా నిర్ణయించారు. సాయంత్రం 7నుండి 7.30 వరకు ఉంటుంది.

8. వేదాశీర్వచనం రుసుము 516 రూపాయలు సమయం 8.30 నుండి 11.30 వరకు.

9. చండి హోమం కు రుసుము 1000 రూపాయలు. ఉదయం 7 నుండి 9.30 వరకు ప్రతి శుక్రవారం జరుపుతారు.

10. రుద్ర హోమం కు రుసుము రూ.516. ఉదయం 9 నుండి 11.30 వరకు ప్రతి సోమవారం ఉంటుంది.

స్వామివారి దేవాలయము నందు మధ్యాహ్నం 2 గంటల తరువాత జరిగే కార్యక్రమాలు ఏకాంతముగా యధావిధిగా  జరుగుతాయని ఈ వో తెలిపారు.

పై తెలిపిన స్వామీవారి సేవలన్ని ఆన్ లైన్ లో పరోక్షంగా జరిపించుకునే భక్తులు ఈ క్రింది తెలిపిన బాంక్ అక్కౌంట్ నంబర్ కు ఆన్ లైన్ ద్వారా పూజా రుసుములు చెల్లించాలని కోరారు. బాంక్ పేరు యూనియన్ బాంక్ ఆఫ్ ఇండియా ద్వారాకాతిరుమల (branch) ఎక్కౌంట్ నంబర్ 010710011000189. IFSC code UBIN 0801071

ఈ విధం గా ఆన్ లై ద్వారా డబ్బులు చెల్లించిన వారు వారి చెల్లింపు వివరాలు వారి పేరు, గోత్ర నామాలు ఈ క్రింది సెల్  ఫోన్ నంబర్లకు తప్పని సరిగా తెలియ పరచవలెనని దేవస్థానం వారు కోరుతున్నారు.

ఇక్కడ ఫోన్ నంబర్ల తోపాటు వాట్సాప్ నంబర్ లు కూడా  పంపడం జరిగింది

9441845400, 8333935558 లాండ్ లైన్ ఫోన్ నంబర్ 08829 271427, 271469 కి గాని లేదా ఇంటర్నెట్ ద్వారా అయితే  http://www.dwarakatirumala.org/ols aponl.html {or} http://www.tms.ap.gov.in  అడ్రెస్  ద్వారా కూడా చెల్లించ వచ్చని దేవస్థానం ఈఓ జి వి సుబ్బా రెడ్డి ప్రకటన ద్వారా తెలియజేసారు.

Related posts

కెటిఆర్‌ జిల్లాకు వస్తే అక్రమ అరెస్టులెందుకు..?

Bhavani

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

Satyam NEWS

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ తో చిన జీయర్ స్వామి

Satyam NEWS

Leave a Comment