30.7 C
Hyderabad
April 17, 2024 00: 09 AM
Slider ఆంధ్రప్రదేశ్

జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన ఉపముఖ్యమంత్రి మామగారు

#Dy CM Pushpa Vani

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నాయకులు వివాదాలకు దూరంగా ఉండే ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావులు అవినీతి అంశాలపై ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ఇసుక, మద్యం కు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, మహీధర్ రెడ్డి కూడా విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామగారు అయిన శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు తన కోడలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తున్నది. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం కురుపాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. రోడ్ల సదుపాయం, తాగునీటి కల్పన, అర్హులైన వారికి పెన్షన్లు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.

వైసీపీకి అనుకూలంగా లేకపోతే.. అర్హత ఉన్నా పెన్షన్లు ఇవ్వట్లేదని ఆరోపించారు. అవకాశం ఉన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కులవృత్తి దారులను శాశ్వతంగా ఆదుకునేందుకు ఎలాంటి పరిష్కారం లేదని శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు విమర్శించారు.

Related posts

సంక్షేమానికి ములస్తంబాలు…వలంటీర్ లకు పురస్కారాలు…

Satyam NEWS

జీతాలు రాక జీవితాలు దుర్భరం

Bhavani

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment