35.2 C
Hyderabad
April 20, 2024 16: 11 PM
Slider పశ్చిమగోదావరి

ప్రయాణీకులు ఆదరణ పొందడానికి ప్రయత్నించాలి

#AllaNani

పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్ టి సి సేవలు మరింత విస్తరింప చేసి ప్రయాణికులకు అందుబాటులో బస్సు లను నడపాలని ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రూట్లలో ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి వీలుగా బస్సు లు నడిపి ఆర్ టి సి పట్ల ప్రయాణికుల్లో మంచి ఆదరణ కలిగే విధంగా ఆర్ టి సి యంత్రాంగం మమేకం కావాలని మంత్రి ఆళ్ల నాని కోరారు.

ఏలూరులోని డిప్యూటీ సిఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం జిల్లా ఆర్ టి సి అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నివారణకు కూడ ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని, బస్సు లు కండిషన్ ముందుగానే చూచుకొని ప్రయాణికులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు.

జిల్లా నుండి దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్ టి సి బస్సు లు సకాలంలో ప్రయాణికులు అవసరం మేరకు నడిపితే ఆర్ టి సి పట్ల ప్రయాణికుల నుండి ఆదరణ కనబడుతుందని, రిజర్వేషన్స్ పట్టిక ఎప్పటికప్పుడు ప్రయాణికులకు అందుబాటులో ఉంచడానికి కూడ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని ఆర్ టి సి అధికారులకు సూచించారు.

జిల్లా కేంద్రం నుండి వివిధ ప్రాంతాలకు ఉద్యోగ బాధ్యతలల్లో వెళ్లే వారికీ సమయానికి బస్సు లు నడిపే విధంగా చూడాలని, చాలా మంది ఉద్యోగులు వారి సమస్యలు తన ద్రుష్టి కి తీసుకువచ్చారని ఉదయం సాయంత్రం బస్సు వేళలు సక్రమంగా పాటించడానికి అధికారులు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. స్టూడెంట్స్ బస్సు పాస్ లు కూడ సకాలంలో ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని, అన్ని విద్యా సంస్థలు ప్రారంభం అయిన దృష్ట్యా కాలేజీ లకు, స్కూల్స్ కి వెళ్లే విద్యార్థులకు బస్సు పాస్ లు తో పాటు సమయానికి బస్సు లు నడపటం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని కోరారు.

వికలాంగులకు బస్సు పాస్ లు ఇవ్వడానికి వారికి వెసులుబాటు కల్పించి వెంటనే బస్సు లు ఇవ్వాలని, బస్సు లు కండిషన్ లో ఉండడానికి ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని, ఆర్ టి సి పట్ల ప్రయాణికులల్లో మంచి అభిప్రాయం కలిగించే విధంగా ప్రయత్నం చేయాలని బస్టాండ్ల్లో రాత్రి సమయంలో ప్రయాణికులకు భద్రత కల్పించే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో జిల్లా ఆర్ టి సి రీజనల్ మేనేజర్ వీరయ్య చౌదరి, డిప్యూటీ CTM నీలిమ, డిప్యూటీ సి ఎం ఈ శ్రీనివాస్ రావు, ఏలూరు డిపో మేనేజర్ సునీత పాల్గొన్నారు..

Related posts

ఈ ఉదయం…

Satyam NEWS

యువత ఓటు ప్రాధాన్యత తెలుసుకోవాలి

Bhavani

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కార్పోరేటర్ దొడ్ల

Satyam NEWS

Leave a Comment