38.2 C
Hyderabad
April 25, 2024 14: 02 PM
Slider జాతీయం

తెలంగాణ భవన్ డిప్యూటీ కమిషనర్ పదవీ విరమణ

#Telangana Bhavan

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని, కానీ విధి నిర్వహణ లో తాను చేసిన సేవలే చిరకాలం గుర్తింపునిస్తాయని, ఈ దిశ లో అంకిత భావం కలిగి  సమర్ధవంతంగా జి. రామ్మోహన్ తెలంగాణ భవన్ కు అందించిన సేవలు ప్రశంసనీయమని  తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. న్యూఢిల్లీ లోని తెలంగాణ భవన్ డిప్యూటీ కమిషనర్ జి. రామ్మోహన్ పదవీ విరమణ అభినందన సమావేశం మంగళవారం సాయంత్రం  తెలంగాణ భవన్ లోని బాలాజీ మందిర్ ఆవరణ లో ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్, డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ, డిప్యూటీ కమిషనర్ హోదా లో పదవీ విరమణ చేస్తున్న రామ్మోహన్ తన పదవీ కాలంలో అధికార, ప్రతిపక్షాల నేతలందరితో కాకుండా ఉన్నతాధికారులు నుండి  తెలంగాణ భవన్ లో పని చేస్తున్న సామాన్య ఉద్యోగులతో సైతం కలుపు గోలుగా వ్యవహరిస్తూ చక్కటి సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా చిరునవ్వుతో అందరినీ పలకరించడమే ఆయనకున్న ప్రత్యేకత అని అభినందించారు.

విధి నిర్వహణ లో సమయ పాలన లో రామ్మోహన్ ముందుండే వారని కొనియాడారు. ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ రామ్మోహన్ ను పూలమాల వేసి, శాలువా కప్పి జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు. గత 35 సంవత్సరాల కాలంలో జి. రామ్మోహన్ సామాన్య ఉద్యోగి స్థాయి నుండి అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ తెలంగాణ భవన్ కు డిప్యూటీ కమిషనర్ హోదా లో పదవీ విరమణ చేయడం అభినందనీయమని తెలంగాణ భవన్ లైసన్ ఆఫీసర్లు గౌస్ మహమ్మద్, నీల్ కంఠ లు అన్నారు.

సన్మాన గ్రహీత పదవీ విరమణ పొందిన డిప్యూటీ కమిషనర్ జి. రామ్మోహన్ మాట్లాడుతూ, మూడున్నర దశాబ్దాల కాలంలో తాను తెలంగాణా భవన్ లో ఉన్నతాధికారుల సమన్వయం తో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, నూతన సంస్కరణలు చేపట్టామని ఉద్యోగుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ అభినందన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ భవన్ అసిస్టెంట్ కమీషనర్ సంగీత, భవన్ మహిళా ఉద్యోగులు వందన, మధుమిత, శ్యామల, అంబాలిక ఉపాధ్యాయ,టూరిజం పిఆర్ఓ, బి. రమాకాంత్,   టిఎస్ఐసి (ఢిల్లీ) అసిస్టెంట్ డైరెక్టర్ హర్ష భార్గవి, తెలంగాణ భవన్ రిసెప్షన్, ప్రోటోకాల్, ఆడ్మిన్ ఉద్యోగులు మొత్యా నాయక్, ధర్మారావు, కన్వర్ సింగ్, సతీష్, దిగంబర్, దినేష్, కేదార్ సింగ్, వికాస్ సూద్, దినేష్ కుమార్, అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Quarantine: ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

భూకంపం: టర్కీ, సిరియాలో 4,500కి చేరిన మృతుల సంఖ్య

Bhavani

మోడీ, సోనియాల సొంత రాష్ట్రాల్లో ఉచిత కరెంటు లేదు

Satyam NEWS

Leave a Comment