28.7 C
Hyderabad
April 20, 2024 04: 07 AM
Slider ముఖ్యంశాలు

నల్లదుస్తులతో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల…

#kolagatla

కేంద్ర మహారాజ హాస్పిటల్ వద్ద నల్ల దుస్తుల తో దీక్ష

విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రి పై మహారాజు పేరును  తొలగించామన్న తప్పుడు ప్రచారంపై ప్రజలకు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు క్షమాపణలు చెప్పాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నల్ల డ్రస్ తో దీక్ష చేస్తూ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ విషయమై బహిరంగ చర్చకు లోకేష్ ముందుకు రావాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ విసిరారు. జిల్లా కేంద్రాస్పత్రిని ప్రభుత్వ స్థలంలో నిర్మించినప్పటికీ, ప్రజలలో తప్పుడు భావన కలిగించే విధంగా అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు ఉన్నాయని,అందుకు నిరసనగా ఆదివారం వైసీపీ శ్రేణులు నల్ల దుస్తులు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు.

జోనల్ కార్యాలయం నుండి కేంద్రాస్పత్రి ఆవరణ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే మీడియాతో మాట్లాడారు. ప్రజలకు జిల్లా కేంద్రాస్పత్రి విషయంలో స్పష్టమైన సమాచారాన్ని ఇస్తూ, ప్రజలను మభ్యపెట్టే విధంగా తప్పుడు విషయాలను బహిర్గత పరుస్తున్న చంద్రబాబు, లోకేష్, అశోక్ గజపతిరాజు తీరును తప్పు పట్టారు. గతంలో ప్రభుత్వ రికార్డులు ప్రకారం జిల్లా కేంద్రస్పత్రిగానే నమోదయి ఉందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు.

ఆసుపత్రి శంకుస్థాపన ప్రారంభోత్సవాలను ఆనాటి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేయగా ఆయా శిలాఫలకాల పైన కూడా కేంద్రాస్పత్రి అని మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఆ తర్వాత క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహారాజా కేంద్రాస్పత్రిగా మార్పు చేశారని చెప్పారు. అయితే  పీవీజీ రాజు పై తమకున్న గౌరవభావంతో అభ్యంతరం చెప్పలేకపోయామన్నారు.

ప్రస్తుతం జిల్లా కేంద్రానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు కావడంతో ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ నుంచి మార్పు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే గతంలో ఉన్న రికార్డులు ఆధారంగా జిల్లా సర్వజన ఆసుపత్రిగా మార్పు చేయడం జరిగిందన్నారు. ఈ విషయమై గత పది రోజుల క్రితం తాము సవివరమైన ప్రకటన చేసినప్పటికీ, ఆరోపణలు చేసిన అశోక్ గజపతి రాజు తప్పును ఇప్పటివరకు ఒప్పుకోలేదు అన్నారు. 

రాజుల కాలంలో కాదు ప్రభుత్వ భూమిలోనే…

ప్రభుత్వ భూమిపై ఆసుపత్రి నిర్మాణం జరిగిందని అయితే రాజులు ఆస్తులలో ఆసుపత్రి నిర్మాణం జరిగినట్లు లోకేష్ ట్విట్లు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కాబట్టి ఇప్పటికైనా తమ తప్పును ఒప్పుకుని ప్రజలకు  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ విషయంలో బహిరంగ చర్చకు రావాలని లోకేష్ కు సవాల్ విసిరారు. ఎన్నో ఏళ్ల కృషి ఫలితంగా జిల్లా కేంద్రానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూర అయిందని అన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అశోక్ గజపతిరాజు ఈర్ష, అసూయలతో ప్రజలను దృష్టిని మారల్చడానికి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గతంలో మూడు లంతర్ల విషయంలో కూడా నానాయాగి చేశారని అన్నారు.

పైడితల్లమ్మ పండుగలో హరిజనరాలైన అనితను ఆలయంలోకి ప్రవేశించకుండా చేశామన్నడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తాను హరిజనలో పుట్టకపోయినా హరిజన నాయకుడు గానే మనగలుగుతున్నానన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు డాక్టర్ వి ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మెడికల్ కాలేజీ మంజూరుకు ప్రస్తావన వచ్చిన కళాశాల ఏర్పాటుకు మాత్రం తెదేపా నేతలు ప్రయత్నించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

కేంద్ర ఆస్పత్రికి అనేకసార్లు అవార్డులు వచ్చినప్పటికీ ఆయా ప్రశంస పత్రాలపై కేవలం కేంద్రాస్పత్రి అని ఉందే తప్ప మహారాజా ని ఎక్కడ ప్రస్తావించలేదని గుర్తు చేశారు. ఫ్లోర్ లీడర్ ఎస్ వి వి రాజేష్ మాట్లాడుతూ కేంద్రస్పత్రి విషయంలో తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారం దురదృష్టకరమని అన్నారు. అందుకు నిరసన తెలియజేస్తూ ఈరోజు ర్యాలీ చేపట్టామన్నారు. నాడు పట్టణ అభివృద్ధి పేరుతో రెండు కోట్ల రూపాయలు నిధులను పెద్ద చెరువులో కలిపేసారన్న విషయాన్ని  మర్చిపోయారని అన్నారు.

మండల పరిషత్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ ఇకనైనా పేరు మార్పు రాజకీయాలు విడనాడాలని హితవు పలికారు. విద్యా వైద్యం ఎక్కడ మెరుగుపడుతుందో ఆయా జిల్లాలు అభివృద్ధి చెందుతారన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

నీటిని పొదుపుగా వాడాలి.. భావి త‌రాల‌కు అందించాలి

Satyam NEWS

(Professional) Renin Lower Blood Pressure What Can Give You High Cholesterol

Bhavani

ఆదివాసీ మహిళ పై గిరిజనేతరుడి అత్యాచారయత్నం

Satyam NEWS

Leave a Comment