27.7 C
Hyderabad
March 29, 2024 03: 24 AM
Slider హైదరాబాద్

ఆద‌ర్శ‌వంతంగా 111 డివిజ‌న్‌ను తీర్చి దిద్దుతా

Harish Rao

టీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డికి మద్దతుగా బీహెచ్ఈఎల్ ఎంఐజీ కాలనీ లో బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిలు పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ .. కరోనా వల్ల డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం ఆల‌స్య‌మైంద‌న్నారు. ఇండ్లు లేని వారికి త్వరలోనే డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లు కేటాయిస్తామ‌ని, ఇంటింటికీ త్రాగునీరు ఇచ్చామ‌ని, బిల్లు కూడా చేస్తామ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ‌తంలో మాదిరిగా కరెంట్ కోతలు లేవ‌న్నారు.

వీట‌న్నింటినీ ప్ర‌జ‌లు బేరీజు వేసుకొని స‌రైన అభ్య‌ర్థి సింధు ఆదర్శ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని డివిజ‌న్ను ఆద‌ర్శ‌వంతంగా తీర్చిదిద్దే బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు.

సర్జికల్ స్ర్టైక్తో ఏం చేస్తారు?


బీజేపీ, ఎంఐఎం పార్టీలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్ల కోసం నీచ రాజకీయల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన అభివృద్ధి, చేయవలసిన అభివృద్ధి గురుంచి చెప్పకుండా కూల్చుతం, కాల్చుతం అని ప్రచారం చేస్తున్నారు. వరద బాధితులకు ఇచ్చే సహాయంను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయ‌ని ఎన్నికల ఫలితాల తర్వాత వరద సహాయం ప్ర‌తీ ఒక్క‌రికీ అందుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్రశాంత హైదరాబాద్ కావాలా…విధ్వంస హైదరాబాద్ కావాలా ప్రజలే ఆలోచించుకోవాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.

టీఆర్ ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

బి హెచ్ ఈ ఎల్ సంస్థ కు 40 వేల కోట్ల ఆర్డర్ ను ఇచ్చింది సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ వల్ల బి హెచ్ ఈ ఎల్ మూతబడకుండా ఉంద‌న్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే భాద్యత సీఎం కేసీఆర్ తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లి బి హెచ్ ఈ ఎల్ రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా పథకం ద్వారా 2016 పింఛను ఇప్పిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

శాంతియుత న‌గ‌రం నిర్మితం అవ‌డం వ‌ల్ల అమెజాన్ కంపెనీ 21 వేల కోట్ల పెట్టుబడి, ఉస్మాన్ నగర్ లో ఐటీ పార్కు,
సుల్తాన్ పూర్ లో మెడికల్ డివైస్ పార్కుతో యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయ‌న్నారు. గత 5 ఏళ్ల తో జరిగిన అభివృద్ధి చూసి హైదరాబాద్ భారీగా పెట్టుబడులు వస్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్యలు ఉంటే పెట్టుబడులు ఆగిపోతాయ‌ని త‌ద్వారా ప్ర‌జ‌లే న‌ష్ట‌పోతార‌ని తాము ఎన్న‌టికీ హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను త‌గ్గించేలా ఎవ‌రైనా ప్ర‌వ‌ర్తిస్తే స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. కరోన, భారీ వర్షాల కష్ట సమయల్లో ప్రజలతో ఉన్నది టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాత్రమేన‌ని హ‌రీష్‌రావు గుర్తు చేశారు.

Related posts

బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో చండీహోమం

Satyam NEWS

ఒకేదేశం, ఒకే జెండా మాదీ అదే నినాదం

Satyam NEWS

త్వరలో నే గ్రూప్ 4 ఫలితాలు వెల్లడి..?

Bhavani

Leave a Comment