37.2 C
Hyderabad
April 19, 2024 13: 27 PM
Slider విజయనగరం

ఈ నెల 15 లోగా ఈ-క్రాప్ నమోదు పూర్తి కావాలి

#ecrop

రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుతున్న సేవల పట్ల రైతులు ఆనందంగా ఉన్నారని వ్యవసాయ  కమీషనర్ హెచ్. అరుణ్ కుమార్ తెలిపారు. ఈ మేర‌కు జిల్లాలోని ఎల్.కోట, ఎస్.కోట,  వేపాడ మండలాల్లో  పలు ఆర్..బి.కే లను   వ్య‌వ‌సాయ క‌మీష‌న‌ర్ అరుణ్ కుమార్ త‌నిఖీ చేసారు. కలక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా కలెక్టర్   సూర్య కుమారి తో కలసి   కమీషనర్ వ్యవసాయాధికారులతో  విత్తనాలు, ఎరువులు, ఈ-క్రాప్ నమోదు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు,  వడ్డీ లేని రుణాలు,  రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు తదితర  అంశాల పై సమీక్షించారు.  

ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాల ను తనిఖీలు చేయాలనీ, స్టాక్ నిల్వలు , ఆఫ్ లైన్, ఆన్లైన్ నిల్వలు, రికార్డు లను పరిశీలించాలని  సూచించారు.  ఎరువులు నిల్వ ఉంచేందుకు అర.బి.కే ల వద్ద స్థలం లేని చోట  రైతులతో మాట్లాడి స్థలాన్ని  తాత్కాలికంగా సేకరించాలని, లేని యెడల అద్దె ప్రాతిపదికన దగ్గరలో అందుబాటులో ఉండే వాటిని తీసుకునేలా  చూడాలని జిల్లా కలెక్టర్ కు తెలిపారు.  జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వ్యవసాయాధికరులంతా  వెంటనే స్థలం గుర్తించే పనిలో ఉండాలని ఆదేశించారు.

జిల్లాలో ఈ క్రాప్ నమోదు 82 శాతం  వరకు అయ్యిందని, మిగిలినది ఈ నెల‌ 15 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 618 ఆర్.బి.కే లకు గాను 93 మాత్రమే భవనాలు  పూర్తి అయ్యాయని,  మిగిలినవి గ్రౌన్దింగ్ లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ ను కోరారు.   ప్రతి రైతు భరోసా కేంద్రం లో విద్యుత్ కనెక్షన్ , టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలని , అదే విధంగా ఆర్.బి.కే   పై లోగో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనీ కమీషనర్ సూచించారు. అనంతరం  జాతీయ ఆహార భద్రతా మిషన్- 2021 వారు ముద్రించిన రైతు మిత్ర కీటకములు పుస్తకాన్ని ఆవిష్కరించారు  ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, వ్యవసాయ శాఖ జే.డి. ఆశా దేవి, ఆత్మా పి.డి. అశోక్ కుమార్,  డి డి  లు, ఎ.డి లు , మండల వ్యవసాయాధికారులు  పాల్గొన్నారు.

Related posts

కాశ్మీర్ లో ఘనంగా సాగుతున్న ఇంటింటిపై త్రివర్ణ పతాకం

Satyam NEWS

కేసిఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే ఖమ్మంకు వైభవం

Murali Krishna

మీకు తెలియకుండానే అరెస్టు జరిగిందా?

Bhavani

Leave a Comment