39.2 C
Hyderabad
March 28, 2024 14: 05 PM
Slider ముఖ్యంశాలు

అత్యవసరమైతే పోలీస్‌ పాస్‌ తీసుకుని వెళ్లండి

#GautamSawang

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఈ–పాస్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న దృష్ట్యా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని ఆయన అన్నారు.

సరైన కారణాలు చెబితే పాస్ ల మంజూరు

అలాంటి వారికి పోలీస్‌ శాఖ ద్వారా అత్యవసర రవాణా పాస్‌లను జారీ చేస్తామని ఆయన తెలిపారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఈ–పాస్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేశారు. వివరాలు: 1.జిల్లా పరిధిలో వెళ్లాల్సి వస్తే.. ఆ జిల్లా ఎస్పీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తే.. తమ జిల్లా ఎస్పీ ద్వారా ఆ వ్యక్తి వెళ్లాల్సిన జిల్లా ఎస్పీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.

2.వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే.. సదరు వ్యక్తికి సంబంధించిన జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించి ఆయా రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం డీఐజీ కార్యాలయం అనుమతి మంజూరు చేస్తుంది.

3.పాస్‌ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి.4. పాస్‌ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి.5. దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్‌ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు.

ఈ–పాస్‌ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.

ALL UNIT OFFICERS WHATSAPP NUMBERS & Email id’S

S.No  Unit Name            WHATSAPP  Mobile Number      e-mail ID’s

1. SRIKAKULAM                       6309990933                      srikakulam@gmail.com

2. VIZIANAGARAM                   9989207326                     spofvzm@gmail.com

3. VISAKHAPATNAM RURAL   9440904229                     vizagsp@gmail.com

4. VISAKHAPATNAM CITY       9493336633                     cpvspc@gmail.com

5. EAST GODAVAI (KAKINADA) 9494933233                  sp@eg.appolice.gov.in

6. RAJAHMUNDRY URBAN     9490760794                     sp@rjyu.appolice.gov.in

7. WEST GODAVARI                 8332959175                    policecontrolroomeluruwg@gmail.com

8. KRISHNA (MACHILIPATNAM) 9182990135                 sp@kri.appolice.gov.in

9. VIJAYAWADA CITY               7328909090                    cp@vza.appolice.gov.in

10. GUNTUR RURAL                 9440796184                   gunturrural@gmail.com

11.GUNTUR URBAN                  8688831568                  guntururbansp@gmail.com

12.PRAKASHAM                        9121102109                  spongole@gmail.com

13. NELLORE                             9440796383                  nelloresp@gmail.com

14.CHITTOOR                            9440900005                  spchittoor@gmail.com

15. TIRUPATHI URBAN              9491074537                  sptpturban@gmail.com

16.ANANTHAPURAM                9989819191                   spatp1@gmail.com

17.KADAPA                                9121100531                    spkadapa2014@gmail.com

18.KURNOOL                            7777877722                    spkurnool.kur@gmail.com

అత్యవసర పనుల కోసం పాస్‌లు తీసుకోదలచినవారు తమ వినతిపత్రాలను పైన ఇచ్చిన వాట్సప్‌ మొబైల్ నెంబర్లకు, మెయిల్ ఐడీలకు మాత్రమే పంపగలరు. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్లకు/మెయిల్ కు అనుమతి పంపుతారు.

మీరు ప్రయాణించేటపుడు జిల్లాల  వాట్సప్‌ నెంబర్, మెయిల్ ఐడీల నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే అంగీకరిస్తారు. ఫార్వర్డ్‌ చేసిన పాస్ మెసేజ్ లు అంగీకరించరు. ప్రయాణించేటప్పుడు మీతోపాటు మీ గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్‌) తప్పనిసరిగా ఉంచుకోవాలని  డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Related posts

రేణు దేశాయ్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా చిత్రం ఆద్య

Satyam NEWS

వైభవంగా దగ్గుబాటి రానా వివాహం

Satyam NEWS

పలు రాష్ట్రాలకు ఐ సి డి ఎస్ ఉత్పత్తుల సరఫరా చేస్తాం

Satyam NEWS

Leave a Comment