28.2 C
Hyderabad
April 20, 2024 11: 55 AM
Slider తెలంగాణ

ఈచ్ వన్ టీచ్ వన్ కు BTA సంపూర్ణ మద్దతు

ktr bata

ప్రభుత్వం అమలు చేస్తున్న EACH ONE TEACH ONE కార్యక్రమం తెలంగాణ సంపూర్ణ అక్షరాస్యతకు బాటలు వేస్తుందనే నమ్మకంతో BTA సంపూర్ణ మద్దతు తెలిపింది. నేడు బహుజన టీచర్స్ అసోసియేషన్ (BTA) రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య కల్పదర్శి  రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను కలిశారు. గత కొన్ని సంవత్సరాలుగా G.O. M.S  NO.342 అమలు కావడం లేదని, ఈ G.O ద్వారా SC, ST ఉపాధ్యాయులు ప్రమోషన్ కోసం వేతనం తో కూడిన సెలవులు ఇస్తూ ఉన్నత విద్య ను అభ్యసించేందుకు కనీసం 2 రెండు సంవత్సరాలు మించకుండా ఇవ్వాలని పేర్కొంది.

కాని కొన్ని సంవత్సరాలుగా ఇది అమలు కావడంలేదని చెప్పడంతో దీనికి మంత్రి స్పందిస్తూ తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  BTA రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య కల్పదర్శి తో బాటు ఉపాధ్యక్షుడు గంధం దాస్, కార్యదర్శి ఆంజనేయులు, TRS ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, ఉపాధ్యక్షుడు కొంగరి శివ శంకర్, కార్యదర్శి వేముల భాస్కర్, EC మెంబెర్స్ మోహన్ చారి, బలరాం, జహీర్, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పరామర్శించడం కాదు…కూలిన ఇళ్లకు పరిహారం ఇవ్వండి

Satyam NEWS

నిరుపేద కుటుంబానికి అండగా బండారి లక్ష్మారెడ్డి

Satyam NEWS

హుజూర్ నగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన

Bhavani

Leave a Comment