39.2 C
Hyderabad
April 23, 2024 18: 19 PM
Slider మహబూబ్ నగర్

తెలంగాణలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కావాలి

#TelanganaEBCs

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు (EBC/EWS) 10% రిజర్వేషన్ కోటను తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం వనపర్తి జిల్లా శాఖ అధ్యక్షుడు  బాబు రెడ్డి డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా కల్పించిన ఈ అవకాశాన్ని అమలు చేయకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. రాబోయే అన్ని పోటీ పరీక్షల్లోనూ, ఉద్యోగ అవకాశాల్లోను ఈబీసీ పేదలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన కోరారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు EWS రిజర్వేషన్స్ అమలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల గత సంవత్సర కాలంగా పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే EWS రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Related posts

Over|The|Counter < What Vitamin Supplements Are Good For High Blood Pressure

Bhavani

వరంగల్ లో ఇన్స్ పెక్టర్ ల బదిలీలు

Sub Editor 2

సింహవాహిని

Satyam NEWS

Leave a Comment