34.2 C
Hyderabad
April 19, 2024 19: 12 PM
Slider హైదరాబాద్

ఈసీఐఎల్ సంస్థ ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనివ్వాలి

#uppalmla

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈసీఐఎల్ సిఎండి ని కోరుతూ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  లేఖను రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ ఈసీఐఎల్ సి ఎస్ ఆర్ నిధులతో చేయూతనివ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కోరారు.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈసీఐఎల్ సంస్థ ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని సంస్థ సీఎండీ సంజయ్ చౌబేను కోరుతూ ఎమ్మెల్యే మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లేఖను విడుదల చేశారు.

పక్షం రోజుల క్రితం ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఈసీఐఎల్  సి.ఎం.డి సంజయ్ చౌబే కలుసుకొని ప్రభుత్వ పాఠశాలలో  విద్యార్థులకు  జరుగుతున్న నాణ్యమైన విద్యాబోధనకు తోడు మౌలిక మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరడం అందుకు సి.ఎం.డి అంగీకరించిన విషయం తెలిసిందే.

సి ఎస్ ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలలకు ప్యాచ్ వర్క్ పనులు,  భవనాలకు కొత్తగా రంగులు వేయడం, పాఠశాలలోని వాష్ రూమ్ లకు కంపెనీ ఆధ్వర్యంలో సఫాయి కార్మికుల ను నియమించడం, 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం సమయాలలో స్నాక్స్ అందజేయాలని లేఖలో కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు నాయకులు గరిక సుధాకర్, ఎంపల్లి పద్మా రెడ్డి, బొడిగె రాజు గౌడ్, సారా అనిల్ ముదిరాజ్, గంప కృష్ణ, సారవినోద్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

వైద్యులకు ధన్యవాదాలు చెప్పిన నాగర్ కర్నూల్ ఎస్ పి

Satyam NEWS

8 వ రోజు చాయ్ అమ్ముతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

Satyam NEWS

ఉప్పల్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా ఆశీర్వదించండి

Satyam NEWS

Leave a Comment