36.2 C
Hyderabad
April 23, 2024 22: 48 PM
Slider విశాఖపట్నం

మహిళల రక్షణ చట్టాలు, దిశా యాప్ పై అవగాహన కల్పించాలి

#Vizag DIG

విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో విశాఖ రేంజ్ డీఐజీ.రంగారావు మహిళల పై జరిగే నేరాలు, పోక్సో కేసులు, ఎస్సీ ఎస్టీ కేసుల దర్యాప్తులో పురోగతిని సమీక్షించేందుకు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు మాట్లాడుతూ మహిళలకు భద్రతకు రక్షణ కల్పించే చట్టాలు గురించి, దిశ చట్టం గురించి, దిశా మొబైల్ యాప్ గురించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు.

ప్రతీ మహిళల భద్రతకు దిశా మొబైల్ యాప్ ను తన స్మార్ట్ ఫోన్ లో నిక్షిప్తం చేసుకొనే విధంగా అవగాహన కల్పించాలన్నారు. క్షేత్ర స్థాయిలో మహిళలకు అవగాహన కల్పించేందుకు ఎంఎస్ పిలు, మహిళా మిత్ర, మహిళా రక్షక్ సభ్యులు సేవలను వినియోగించుకోవాలన్నారు.

దిశా యాప్ అత్యవసర సమయాల్లో మహిళల భద్రతకు ఎలా ఉపయోగపడుతుందో వివరించాలన్నారు. పార్కులలో, నేరాలు జరిగేందుకు ఆస్కారమున్న ప్రదేశాలలో సీసీ కెమారలు ఏర్పాటే చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

దిశ మొబైల్ యాప్ ను ప్రతి మహిళ తమ స్మార్ట్ ఫోన్స్ లో ఇన్స్టాల్ చేసుకొనే విధంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, దిశయాప్ పనిచేసే విధానం గురించి ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలిన పోలీసు అధికారులను విశాఖ రేంజ్ డీఐజీ ఆదేశించారు.

దర్యాప్తులో ఉన్న మహిళల పై జరిగే నేరాలు, పోక్సో కేసులు మరియు ఎస్ సి మరియు ఎస్టీ కేసులలో దర్యాప్తు వేగవంతం చేయాలని, నిందితులు శిక్షింపబడే విధంగా సాక్ష్యాలను సేకరించి, అభియోగ పత్రాలను నిర్దిష్ట సమయాల్లో దాఖలు చేయాలన్నారు.

దర్యాప్తులో ఉన్న కేసులను సమీక్షించి, దర్యాప్తును పర్యవేక్షించి, సంబంధిత అధికారులకు దర్యాప్తులను పూర్తి చేసేందుకు విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కే.వి.రంగారావు దిశానిర్దేశం చేసారు.

ఈ జూమ్ వీడియో కాన్స్ రెన్స్ లో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు, పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్, దిశ  డీఎస్పీ టి.త్రినాధ్, ఎస్ సి మరియు ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, సిఐలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

టెట్ నోటిఫికేషన్ విడుదల

Bhavani

హామీలను వెంటనే పరిష్కరించాలి

Murali Krishna

క్విడ్ ప్రోకో: రైతుల కేసులపై రూ.5 కోట్లు ఖర్చు చేస్తారా?

Satyam NEWS

Leave a Comment