33.2 C
Hyderabad
April 26, 2024 01: 28 AM
Slider రంగారెడ్డి

పేదరికం నుండి బయట పడాలంటే చదువు ఒక్కటే మార్గం

#uppala

పేదరికం నుండి బయటపడాలంటే కష్టపడి చదువు కోవడం ఒక్కటే మార్గమని ఉప్పల వెంకటేష్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ గ్రామంలో పేద ప్రజల ఆరోగ్యం కోసం తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

శిబిరంలో తన మొదటి కుమారుడు డాక్టర్ అఖిల్ ఆధ్వర్యంలో కామినేని హాస్పిటల్ వైద్యులచే జనరల్ చెక్ అప్ చేస్తూ  అనారోగ్యానికి గురైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో దాదాపు 555  మంది విద్యార్థిని విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకోవడం ఒక వరమని చదువుకుంటే జీవితంలో 75% విజయం సాధించినట్లని చదువుకుంటేనే ఆర్థికంగా బలోపేతం అవుతామని తెలిపారు. చదువు ఉంటేనే పేదరికం నుండి ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని అన్నారు. మంచిగా చదువుకొని విద్యను బోధించిన గురువులకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు, తెచ్చే విధంగా కష్టపడి చదువుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంతోష పరచాలని కొద్దిసేపైనా వారి కళ్ళలో ఆనందాన్ని చూడాలని ఆకాంక్షతో ఇట్టి కార్యక్రమాలు చేపడుతున్నట్లు అని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో మాడుగుల ఎంపీపీ గౌరారం పద్మా రెడ్డి  తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ , మాజీ జెడ్పిటిసి రవి , గ్రామ వార్డు మెంబర్ సభ్యులు పగుడాల  శ్రీశైలం సర్పంచ్ రఘుపతి హనుమాన్ నాయక్ పగుడాల వెంకటనారాయణ కిషోర్ నాయక్ పగడాల వెంకటేశు పగుడాల శీను బొడ్డు శంకర్ కాసుల ఓంకారం ఆర్కపల్లి ఉపసర్పంచి బిక్కు గౌడ్ చరణ్ శేఖర్ మహేష్ విజయ్  గ్రామ పెద్దలు యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలి

Satyam NEWS

ఫిబ్ర‌వ‌రి 1న రథసప్తమికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Satyam NEWS

కేస్ డిస్మిస్:రజనీ పైదాఖలైన పిటిషన్ కొట్టివేసీన హైకోర్టు

Satyam NEWS

Leave a Comment