28.7 C
Hyderabad
April 20, 2024 05: 09 AM
Slider మహబూబ్ నగర్

ఉద్యాన సాగు రైతుల విజ్ఞాన యాత్ర ఆరంభం

#nagarkurnool

నాగర్ కర్నూలు జిల్లా కు చెందిన 40 మంది ఉద్యాన సాగు రైతులు విజ్ఞాన యాత్రకు బయలుదేరి వెళ్లారు. కలెక్టరేట్ కార్యాలయం ఆవరణ నుండి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ విజ్ఞాన యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాల పనితీరును సంఘాల ఆవశ్యకతను తెలుసుకునేందుకు రైతులు విజ్ఞాన యాత్రకు వెళ్తున్నారు. వారం రోజుల పాటు మహారాష్ట్రలోని నాసిక్ సహ్యాద్రిఫామ్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సాగుచేసే విధానాల పనితీరును తెలుసుకునేందుకు జిల్లా ఉద్యానశాఖ ఈ విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేసింది. అక్కడ సహ్యాద్రి ఫామ్స్‌లోని వివిధ రకాల పరిశ్రమలను, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కేంద్రాలను రైతులు సందర్శించి, తెలుసుకోనున్నారు. ఈ యాత్రలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి 40 మంది రైతులు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి చంద్రశేఖర్ రావు, సోమవారం ఉదయం బయల్దేరారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్

Related posts

శబ్ద కాలుష్యానికి కారణమైన బుల్లెట్లు సీజ్

Satyam NEWS

బాధితులకు అండగా నిలవండి

Bhavani

పోలీసు ఉద్యోగార్ధులకు శారీరక దృఢత్వ శిక్షణ కేంద్రంలో పాలు పంపిణీ

Satyam NEWS

Leave a Comment