27.7 C
Hyderabad
April 25, 2024 10: 57 AM
Slider ప్రత్యేకం

తల్లిదండ్రుల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న కార్పొరేట్లు

#Students in Classroom

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాయి. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేక రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు చేతులు ఎత్తేయడం ఈ కార్పొరేట్ కాలేజీలకు వరంగా మారింది.

ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని కార్పొరేట్ కాలేజీలు బ్లాక్ మెయిల్ కు దిగుతున్నాయి. చాలా కార్పొరేట్ విద్యా సంస్థలకు స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల చైన్ ఉన్నది. వారి స్కూళ్లలో చదివిన విద్యార్ధులు వారి కాలేజీలలోనే చేరాలనే విధంగా కార్పొరేట్ విద్యాసంస్థలు ఈ బ్లాక్ మెయిల్ కు తెరతీశాయి.

కరోనా కారణంగా  పదో తరగతి పరీక్ష రాయకుండానే ఇంటర్ మీడియట్ కు వెళ్లేందుకు విద్యార్ధులకు అనుమతి లభించిన నేపథ్యంలో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తున్నారు. ఇంటర్నల్ మార్కులు తమ చేతుల్లోనే ఉన్నాయని, తమ కాలేజీలలో చేర్పించకపోతే వాటిని తగ్గిస్తామని వారు తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు.

ముందుగా 5, 10 వేలు కట్టి అడ్మిషన్ తీసుకొంటే.. 10/10 గ్రేడ్ వచ్చేలా. . మార్కులు వేస్తాం.. అని తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. మా కాలేజీలో చేరకపోతే మీకు ఇంటర్నల్ మార్కులు తక్కువ వేస్తాం అంటూ బెదిరిస్తున్న సంఘటనలు కోకొల్లలు.

వాస్తవానికి ఇంటర్నల్ ఎసెస్ మెంట్ మార్కులు ప్రయివేటు స్కూళ్ల చేతుల్లో లేవు. క్వార్టర్లీ, హాప్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ మార్కులు ఇప్పటికే పదో తరగతి బోర్డుకు పంపించేశారు. ప్రీ ఫైనల్ లో కొందరి మార్కులు ఏ కారణం వల్లనైనా పంపి ఉండకపోతే నేటితో ఆ గడువు ముగిసింది.

అందువల్ల ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు చేసే బ్లాక్ మెయిల్ కు విద్యార్ధుల తల్లిదండ్రులు లొంగవద్దు. తమ పిల్లలను తమ ఇష్టం వచ్చిన చోట ఇంటర్ లో చేర్చుకోవచ్చు.

Related posts

సన్ గాడ్:అరసవెల్లిలోరథసప్తమి వేడుకలుభక్తుల సందడి

Satyam NEWS

సమాజ సేవలో ముందున్న పిఆర్ టియు ఉపాధ్యాయ సంఘం

Satyam NEWS

డెడ్ బాడీ కి చికిత్స చేసిన వైద్యులు

Satyam NEWS

Leave a Comment