24.7 C
Hyderabad
March 26, 2025 10: 40 AM
Slider నల్గొండ

ఇళ్ల వద్దనే ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు

#Eed Ul Fitar

ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి ముస్లింలు తమ తమ ఇళ్లలోనే రంజాన్ పండుగ ఉపవాస దీక్షలు ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజులు కఠిన నియమ నిబంధనలతో ఉపవాస దీక్షలు ఇళ్లలోనే  కొనసాగించిన ముస్లిం సోదరులు ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించటంతో  ఉపవాస దీక్షలు విరమించారు.

సోమవారం నాడు ముస్లిం సోదరులు ప్రభుత్వ నిబంధనల  మేరకు  తమ తమ ఇళ్లలోనే రంజాన్ పండుగ ఈద్-ఉల్-ఫితర్ నమాజులు నిర్వహించుకున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ముస్లింలు ఇండ్లకే పరిమితమై ఉపవాసాలు ప్రార్థనలు నిర్వహించుకున్నారు. ముస్లింలు రంజాన్ పండుగ షాపింగ్ కూడా  చేయకుండా ఆ డబ్బుతో పేదలకు దానధర్మాలు చేశారు. ప్రపంచంలో కరోనా వైరస్  అంతం కావాలని సర్వమానవాళి సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లాను ప్రార్థించారు.

ఒకరికొకరు ఆలింగనం చేసుకోకుండానే పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక అన్ని పార్టీల నాయకులు ఫోన్ల ద్వారా ముస్లిం నాయకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా మస్జిద్ ముఫ్తి మహమ్మద్ గౌస్ ఉద్దీన్ , ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మన్సూర్ అలీ, ఎండీ అజీజ్ పాషా,రఫీ. ఎం.ఎ మజీద్,షేక్ బిక్కన్,  ఎస్డీ మున్ను,రహీమ్, జానీమియా, యూసుఫ్,సిరాజ్, సాదిక్ ,నజీర్ ,జానీ పాషా,రోషన్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మేడారం జాతర పనులపైన నిర్లక్ష్యం వద్దు

Satyam NEWS

హిందువుల పండుగ‌ల‌పై విషం చిమ్మే ప్ర‌క్రియ‌

Sub Editor

కరీంనగర్ సిగలో సిద్ధమవుతున్న తీగలమణిహారం

Satyam NEWS

Leave a Comment