35.2 C
Hyderabad
April 24, 2024 14: 00 PM
Slider ముఖ్యంశాలు

పాపం ఈనాడు చివరికి ఇలా అయిపోయింది

eenadu kadapa

పాపం పెద్దాయన ఇలా జరుగుతుందని ఊహించి కూడా ఉండరు. పెద్దాయన అంటే రామోజీ రావు. ఈనాడు పత్రిక ఎడిషన్లు పెంచుకుంటూ పోవడమే కానీ మూసేయడం లేదు. సర్క్యులేషన్ పెరగడమే కానీ తగ్గిపోవడం లేదు. అయితే నేటి నుంచి కడప ఎడిషన్ మూసేశారు.

కారణం ఏమిటంటే కరోనా. కరోనా కారణంగా న్యూస్ ప్రింట్ లేక, పత్రిక కు యాడ్లు లేక సతమతం అవుతూ నామమాత్రంగా నడుపుతున్నారు. ప్రింటు చేసినా పత్రికలను పంచే వాడు లేకుండా పోయాడు. దాంతో ఈనాడు తన ప్రింట్ ఆర్డర్ ను దారుణంగా తగ్గించేసుకుని చిన్న పత్రిక స్థాయికి వచ్చేసింది.

(ఒక్క ఈనాడే కాదు అన్ని పత్రికల పరిస్థితి ఇదేనని సత్యం న్యూస్ గతంలోనే చెప్పింది) అయితే ఈనాడు మాత్రం అన్ని ఎడిషన్లను క్రమం తప్పకుండా నడుపుతున్నది. ఈ నాడు కడప ఎడిషన్ అలన్ కాన్ పల్లిలో ఉంటుంది. అక్కడ ఎవరికో కరోనా వైరస్ వచ్చింది. రెండు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.

దాంతో అలన్ కాన్ పల్లిని రెడ్ జోన్ గా డిక్లేర్ చేశారు. రెడ్ జోన్ లో ఉన్నారు కాబట్టి బయట వారు లోపలికి లోపలి వారు బయటకు వెళ్ల రాదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈనాడు యాజమాన్యానికి కూడా ఇదే సమాచారం ఇచ్చారు.

మరేం చేయాలి పత్రిక రావాలి కదా అని అడిగితే ముందైతే క్లోజ్ చేయండి తర్వాత చూద్దాం అన్నారట. దాంతో ఏం చేయాలో అర్ధం కాక ఈనాడు యాజమాన్యం కడప ఎడిషన్ ను మూసేశారు. కడప ఎడిషన్ ప్రింటింగ్ సమయంలో ఈనాడు యాజమాన్యం చాలా జాగ్రత్తలే తీసుకున్నది. మాస్కులు, చేతికి గ్లౌజెస్ కూడా ఇచ్చారు. కార్మికులు జాగ్రత్తగానే వస్తున్నారు వెళుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఒప్పుకోలేదు. అదీ సంగతి. కడప జిల్లాలో ఈనాడు ఆగిపోవడంతో వైసీపీ శ్రేణులు మాత్రం లోలోన సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Related posts

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు శస్త్రచికిత్స

Bhavani

పంట నీరు వృధా అవుతున్నా పట్టించుకోవడం లేదు

Satyam NEWS

తెలంగాణ గవర్నర్ తో పురందేశ్వరి భేటీ

Satyam NEWS

Leave a Comment