30.3 C
Hyderabad
March 15, 2025 10: 23 AM
Slider ప్రపంచం

సౌదీ అరేబియాలో ఇంటి నుంచే ఈద్ కార్యక్రమం

#Faisal Bin Mishaal

ఇంటి నుంచే ఈద్ కార్యక్రమాన్ని సౌదీ అరేబియాలోని క్వాసిమ్ ప్రాంత గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ మిషాల్ ప్రారంభించారు. క్వాసిమ్ ప్రాంత సామాజిక అభివృద్ధి, మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఇంటి నుంచే ఈద్ ను అందరూ అనుసరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

ఈ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఇంటి నుంచే ఈద్ ను ప్రతి ఒక్కరూ పాటించడం అత్యవసరమని ఆయన అన్నారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా క్వాసిమ్ ప్రాంతంలోని వారందరికి లక్ష బహుమతులు పంచి పెట్టే స్కీమ్ ను రూపొందించినందుకు ఆయన గవర్నరేట్స్ ను అభినందించారు.

కరోనా వైరస్ పై జరుపుతున్న పోరాటంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఈ మంత్రిత్వ శాఖ ఈదుల్ ఫితర్ సందర్భంగా అందరికి బహుమతులు అందచేసేందుకు కూడా ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అందరూ ఇంటిలోనే ఈద్ జరుపుకోవాలని ఎవరూ బయటకు రావద్దని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

హన్మకొండ అనాథ ఆశ్రమంలో దీపావళి సంబరం

Satyam NEWS

చంద్రబాబు విదేశీ పర్యటన ఖర్చుపై ఆర్టీఐ కింద విచారణ

Satyam NEWS

అమరా ప్రసాద్ దిష్టబొమ్మ దహనం

mamatha

Leave a Comment