36.2 C
Hyderabad
April 24, 2024 19: 05 PM
Slider గుంటూరు

హత్య కేసులో ఎనిమిది మంది అరెస్టు

#mardercase

గుంటూరు జిల్లా నరసరావుపేట లోని ఇస్లాంపేట ప్రధాన రహదారిపై గత నెల 27న జరిగిన సయ్యద్‌ పీర్‌వలి అలియాస్‌ అల్లాఖసం హత్య కేసులో ఎనిమిదిమంది నిందితులను రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం ఎస్‌ఆర్‌కేటీ కాలనీకి చెందిన జాన్‌ బీ అనే మహిళ పెద్దకుమారుడు సుభాని హత్య కేసులో ప్రధాన నిందితుడైన అల్లాఖసం గత నెలలో జైలు నుంచి బెయిల్‌పై బయటకు రావడంతో తమను కూడా ఎక్కడ చంపేస్తాడోనన్న భయంతో జాన్‌బీ మరికొందరు కలసి పథకం ప్రకారం అల్లాఖసంను హత్య చేశారని చెప్పారు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలిపారు. అల్లాఖసం ఇస్లాంపేట ప్రధాన రహదారి పక్కన మద్యం తాగుతున్న సమయంలో జాన్‌బీ, ఆమె తమ్ముడు, కుమారుడు, మరో ఐదుగురు వ్యక్తులు కలిసి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారన్నారు. నిందితులు పఠాన్‌ జాన్‌బీ, షేక్‌ హుస్సేన్, సయ్యద్‌ అబ్బాస్, గూడెపు సునీల్, వినుకొండ పవన్, ఇట్టి సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, మరో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపనున్నట్లు పేర్కొన్నారు. హత్య కేసు నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన రెండోపట్టణ ఎస్సై రబ్బానీ, సిబ్బందిని ఆయన అభినందించారు.

Related posts

తునిలో మంత్రి ధర్మాన మునిసిపల్ ఎన్నికల ప్రచారం

Satyam NEWS

వెంటనే నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయండి

Satyam NEWS

భైంసా పట్టణంలోని పంజేషా చౌక్ వద్ద ఉద్రిక్తత

Satyam NEWS

Leave a Comment