32.7 C
Hyderabad
March 29, 2024 13: 04 PM
Slider జాతీయం

తెలంగాణ తో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ షురూ

#Election

తెలంగాణ తో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను సీఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం) ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రాల సీఎస్‌ లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ, పోలీస్‌

అధికారులను బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రాల్లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు వాళ్ల సొంత జిల్లాలో పోస్టింగ్‌ ఇవ్వొద్దని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. జులై 31 లోపు బదిలీల ప్రక్రియ

పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. స్థానికంగా అధికారులకు బంధుత్వాలు లేవని డిక్లరేషన్‌ తీసుకోవాలని తెలిపింది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Related posts

కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది

Satyam NEWS

సీరియల్ కంటిన్యూస్: ఏపికి తదుపరి సిఎస్ ఎవరు?

Satyam NEWS

మూడు రోజుల పాటు వానలే వానలు

Satyam NEWS

Leave a Comment