శ్రీకాకుళం జిల్లా మాస్టర్ అథ్లెట్స్ అసోసియేషన్ ఎన్నికలు పాత శ్రీకాకుళం కంపోస్ట్ కాలనీ దగ్గర గల ఏపీ హెచ్ బి కాలనీలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గా మహమ్మద్ ఖాసిం ఖాన్, అర్జున్ రావు రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే ఎన్నికల్లో జిల్లా కార్యవర్గం కొన్ని ఎన్నుకున్నారు. చీఫ్ పేట్రైన్ గా ఎం .ఎస్ .ఆర్ .కృష్ణ మూర్తి, ఉపాధ్యక్షులుగా మహమ్మద్, కళావతి, ఎం చంద్రశేఖర రావు, ఎం విరమణ , ఏ .విజయ్ కుమార్, ఎం సాంబమూర్తి, సంయుక్త కార్యదర్శిగా ఎం వాసుదేవ చారి, కార్యనిర్వహక కార్యదర్శిగా ఎండి రజియా బేగం, కోశాధికారిగా మహమ్మద్ ఇక్బాల్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా స్వీటీ రెడ్డి, జామి జగన్నాధరావు దూడ హరి గోపాల్, పి రమణ మూర్తి, బివి రమణ, ఎమ్మెస్సీ శేఖర్,ముఖ్య సలహాదారులు గా పి.సుందర రావు ఎన్నిక అయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి వ్యాయామ ఉపాధ్యాయులు గుండ బాల మోహన్, జగన్, కె.నరేష్, ఎల్ దిలీప్, అప్పలరాజు తదితరులు హాజరయ్యారు.