జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (JCHSL) ఎన్నికలను హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వెంటనే నిర్వహించాలని కోరుతూ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆప్ కో ఆపరేటివ్ సోసైటీస్ గోల్కొండ రోజారాణికి సొసైటీ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఒకరిద్దరు గతంలో ఎన్నికలను ఆపడానికి వ్యక్తిగత స్వార్థం తో ఇచ్చిన పాత పిర్యాదుపై తాము కోర్టు కు వెళ్లగా అన్ని విషయాలు పరిశీలించి, జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు వెంటనే జరపాలని హైకోర్టు తీర్పు లో స్పష్టంగా పేర్కొన్న విషయం డిప్యూటీ రిజిస్ట్రార్ దృష్టికి తేవడం జరిగింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన తరువాత కూడా ఒకరిద్దరు వ్యక్తి గత స్వార్థం తో పాత విషయాలను మరలా ఉటంకిస్తూ చేసిన పిర్యాదు పరిగణనలోకి తీసుకోవద్దని కోరడం జరిగింది. కో ఆపరేటివ్ చట్టం ప్రకారం, ఎన్నికలు జరపాలని హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ముందుకు పోతామని ఆమె తెలిపారు.
previous post