ప్రభుత్వం నిర్వహించిన పల్లె ప్రగతి (30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక) కార్యక్రమంలో అన్నిశాఖల్లోకెల్లా విద్యుత్ శాఖ అద్భుతంగా సేవలందించి ప్రథమస్థానంలో నిలవడం పట్ల జెన్ కో – ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్ లో బుధవారం జరిగిన సమీక్షలో విద్యుత్ శాఖ నంబర్ వన్ గా నిలిచినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సిబ్బంది రేయింబవళ్లూ పనిచేసి, విద్యుత్ సంబంధిత పనులు చేశారని అభినందించారు. విద్యుత్ సిబ్బంది సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ కు ప్రభాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి, భవిష్యత్ లో కూడా విద్యుత్ సంబంధిత సమస్యలను వెంటవెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తామని సీఎండీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అనేక రకాల సేవలు అందిస్తూ అటు ప్రభత్వం, ఇటు ప్రజల నుంచి అభినందనలు అందుకోవడం వెనుక విద్యుత్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది శ్రమ ఫలితం, సీఎం కేసిఆర్ మార్గనిర్దేశం కారణం అని సిఎండి ప్రకటించారు
previous post
next post