28.7 C
Hyderabad
April 20, 2024 07: 10 AM
Slider తూర్పుగోదావరి

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

#Electricity short

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడిసిన్ విభాగంలో ఇన్ టెన్సీవ్ కేర్ యూనిట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. గురువారం సాయంత్రం అక్కడ ఉన్న ఏసీ యంత్రం నుండి ఒక్కసారిగా మంటలు రావడం వల్ల ఆ విభాగంలో దట్టమైన

పొగ అల్లుకుపోయాయి. దీంతో చికిత్స పొందుతున్న రోగులు బెంబేలెత్తారు. దీంతో వారి తాలూకు బంధువులు వారిని బయటకు తీసుకువచ్చి వరండాపై పడుకోబెట్టారు. ఏసీ కాలి పోవడంతో వచ్చిన పొగ వల్ల చికిత్స పొందుతున్న

వారందరికీ ఊపిరి ఆడక పోవడంతో చాలా ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై ఇన్చార్జి సూపరింటెండెంట్ ఎస్ వెంకటరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి తెలుసుకున్నారు. ఇన్ టెన్సీవ్ కేర్ యూనిట్ లో 12 బెడ్లు ఉండగా 11

మంది చికిత్స పొందుతున్నారని వారిలో ఏ ఒక్కరికి ప్రాణాపాయస్థితి రాలేదని చెప్పారు. ప్రస్తుతం ఏసీ రిపేరు పనులు చేయించి పునరుద్ధరించే పనులు చేస్తున్నామని వెంకట్ రెడ్డి తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చికిత్స నిమిత్తం వేరే ఇతర వార్డులకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

Related posts

తండ్రి ఎదుటే యువతి కిడ్నాప్

Bhavani

‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ థియేట్రిక‌ల్ రిలీజ్ ఈవెంట్‌

Satyam NEWS

లిబియా అధ్యక్ష బరిలో గడాఫీ కుమారుడు

Sub Editor

Leave a Comment