27.2 C
Hyderabad
December 8, 2023 19: 17 PM
Slider సినిమా

మూడు భాషల్లో వస్తున్నఅనుష్క నిశ్శబ్దం

anushka

ఎలిగెంట్ స్టార్ అనుష్క నటిస్తున్న తదుపరి చిత్రం నిశ్శబ్దం. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. నిశ్శబ్దంలో అనుష్క మాట‌లు రాని అమ్మాయి పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంది. ఇలాంటి వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. ఇప్పటి వరకూ అనుష్క చేసిన సినిమా అన్నింటి కన్నా నిశ్శబ్దంలో తను చేయబోయే పాత్ర చాలా డిఫికల్ట్. రాణిగా అద్భుతంగా, అవలీలగా నటించే అనుష్క, నిశ్శబ్దంలో పాత్ర గురించి తెలుసు కాబట్టే ఈ పాత్ర‌ కోసం చాలానే క‌ష్ట‌ప‌డింద‌ట‌. ఈ పాత్రని బాగా చేయడానికి నిజంగా అంధత్వ సమ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న పిల్ల‌ల‌ను క‌లుసుకుని వాళ్ల‌ను ద‌గ్గ‌రుండి గ‌మ‌నించింద‌ట‌. అలాగే ఓ ట్రైన‌ర్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకుని మ‌రీ న‌టించ‌ద‌ట‌. ఇందులో అనుష్క పెయింట‌ర్‌గా క‌న‌ప‌డ‌నుంది కాబట్టి పెయింటింగ్ క్లాసెస్ కూడా తీసుకుందట. నిశ్శబ్దం కోసం అనుష్క పడిన కష్టం తెరపై కనిపిస్తుందట. తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ త్వరలో రిలీజ్ కానుంది. మాధవన్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి హేమంత్ మధుక‌ర్ ద‌ర్శ‌కుడు. కోన వెంక‌ట్, టీజీ విశ్వ‌ప్రసాద్ నిర్మాత‌లు

Related posts

డాక్టర్లపై దాడికి ఇక కఠిన శిక్షలు

Satyam NEWS

డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత శారదక్క

Satyam NEWS

యువగళంలో లోకేష్ ని కలిసిన బాలకోటయ్య

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!