32.2 C
Hyderabad
March 29, 2024 01: 04 AM
Slider జాతీయం

పంట పొలాలు నాశనం చేస్తున్న ఏనుగుల దండు

#Elephants attack

తమిళనాడు లోని హోసూరు, సూల్ గిరి లోతట్టు అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల మంద రావడంతో చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్ర , తమిళనాడు, కర్ణాటక అటవీ సరిహద్దు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా ఏనుగులు కనిపిస్తున్నాయి.

అటవీ సరిహద్దు ప్రాంతం అయిన మోట్ల చేను, గుడ్ల నాయన పల్లి, సోడి గాని పల్లి , గంగాపురం , యమసనపల్లి ప్రాంతంలో ఏనుగులు పొలాలు ధ్వంసం చేస్తున్నాయి. ఈ ప్రాంతాలే కాకుండా మల్లప్ప కొండ అటవీ సరిహద్దు ప్రాంతాలైన చిన్న పర్తి కుంట, పెద్ద పర్తి కుంట, సంగనపల్లి, బోయనపల్లి, కుసురులలో కూడా ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి.

ఈ అటవీ సరిహద్దు పరిసర ప్రాంతాల్లో ఉన్న టమోట, క్యాబేజ్, మొక్కజొన్న వరి, బొప్పాయి, బీన్స్,  అరటి పంట పొలాలపై అర్ధరాత్రి వేళలో ఏనుగులు దాడులు చేస్తున్నాయి. ఈ ఏనుగులను చెదరగొట్టేందుకు ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఎలిఫెంట్ ట్రాకర్స్ రంగంలోకి దిగారు.

ఏనుగులు మంద పంట పొలాల పై కి రాకుండా ఉండేందుకు గతంలోనే అక్కడక్కడ విద్యుత్ కంచె, కంద కాల్వలు ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

Related posts

కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయండి

Satyam NEWS

మునుగోడు తరహా ప్రయోగానికి జగన్ సిద్ధం?

Satyam NEWS

శోభాయమానంగా ఆరంభమైన శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

Leave a Comment