27.7 C
Hyderabad
April 26, 2024 05: 24 AM
Slider కడప

అర్హులయిన లబ్దిదారులందరికీ రుణం

kadapa comm

అర్హులైన ల‌బ్ధిదారులంద‌రికీ రుణ స‌దుపాయం క‌ల్పించి వారి ప్ర‌గ‌తికి దోహ‌ద‌ప‌డాల‌ని క‌డ‌ప‌ జిల్లా సంప్రదింపుల కమిటీ (డిసిసి) ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ హరికిరణ్ స్ప‌ష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ప్ర‌భుత్వం చేప‌డుతున్న ఆయా సంక్షేమ ప‌థ‌కాల‌పై క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి , జేసీ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ హాజరయ్యారు. ఈ నెల 10న “వైఎస్ఆర్ చేయూతష కింద‌ లబ్దిదారులకు మేకలు, గొర్రెలు యూనిట్ల పంపిణీ చేస్తామ‌న్నారు. డిసెంబర్ 15వ తేదీ లోపు “వైఎస్ఆర్ భీమా” నమోదు ప్రక్రియ పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ అధికారుల‌కు ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జీనోపాదుల మెరుగుకోసం చ‌ర్య‌లు

ఈ సందర్బంగా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ… జిల్లాలో “వైఎస్ఆర్ చేయూత” పథకం ద్వారా ప్రభుత్వం రూ.18750లను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిందన్నారు. వీరి జీవనోపాదులను మెరుగుపరిచేందుకు.. పాడి పశువులు, గొర్రెలు, మేకలు తదితర జీవులను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించడం జరుగుతోందన్నారు. ఇప్పటికే కొంతమంది లబ్దిదారులు పాడి పశువులను ఎంపిక చేసుకుని.. బ్యాంకు రుణాల ద్వారా పశువులను కూడా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఫిబ్రవరి మాసం లోపు 2700 పశువుల మంజూరు లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 104 పశువులను లబ్దిదారులకు బ్యాంకు రుణం ద్వారా మంజూరు చేయడం జరిగిందన్నారు.

మేక‌లు, గొర్రెల యూనిట్ల ఎంపిక‌

అలాగే.. మేకలు, గొర్రెల పెంపకం యూనిట్ల ద్వారా ఉపాధి పొందాలనుకునే వారి జాబితా ఇప్పటికే సిద్ధం చేయడం జరుగుతోం దని, ఈ నెల 10వ తేదీ లోపు 1500 యూనిట్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన సంబందిత లబ్దిదారులకు యూనిట్లను అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ లైన్ వర్చువల్ విధానం ద్వారా.. ప్రారంభించనున్నట్లు తెలిపారు. మేకలు, గొర్రెల పెంపకం దారులకు ఋణ సదుపాయాన్ని కల్పించేందుకు నిర్ధేశిత లక్ష్యం లేదని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు.

ఇంటింటికి రేష‌న్ ద్వారా నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి

అలాగే.. పాడి రైతులందరికీ “పశు కిసాన్ క్రెడిట్ కార్డు”లను పంపిణీ చేసేలా బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న “ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీ” కార్యక్రమానికి సంబంధించి జిల్లాకు 514 ట్రక్కులను కేటాయించామ‌న్నారు. ఈ ట్రక్కుల కొనుగోలు విషయంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా.. అర్హులయిన వారికి సబ్సిడీ ద్వారా ట్రక్కులు కొనుగోలు చేసేందుకు యూనియన్ బ్యాంకు రుణ సదుపాయాన్నికల్పిస్తోంద‌న్నారు. అందుకు సంబంధించి.. ఆయా మండలాల్లో ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో లబ్దిదారులకు ఎంపిక చేయడం జరుగుతోందన్నారు. లబ్దిదారులకు రుణాన్ని అందించడంలో బ్యాంకు అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలన్నారు.

అర్హులైన వారంద‌రికీ రుణాలు

అలాగే.. “వైఎస్ఆర్ భీమా‌ పథకానికి సంబంధించి లబ్ధిదారుల వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్నిడిసెంబర్ 15వ తేదీ లోపు.. పూర్తి చేయాలని బ్యాంకు అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, పీఎం స్వనిధి పథకాల లబ్దిదారులకు.. వారికున్న అవకాశాలను సద్వినియోగించుకునేలా.. అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు అందించి ప్రోత్సహించాలని కలెక్టర్ బ్యాంకు అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్, మెప్మా పిడి రామమోహన్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి సత్యప్రకాష్, వివిధ బ్యాంకుల రీజనల్ మేనేజర్లు అరవింద కుమార్ (యూనియన్ బ్యాంకు), శైలేంద్రనాథ్ (ఆంధ్ర ప్రగతి), ప్రసాద్ (కెనరా), మల్లికార్జున (ఎస్.బి.ఐ), పలు శాఖల బ్యాంకు మేనేజర్లు, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో పెరుగుతున్న ఆశలు

Satyam NEWS

ట్రిబ్యూట్: డోన్ లో చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి

Satyam NEWS

దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాధపురం

Bhavani

Leave a Comment