27.7 C
Hyderabad
April 25, 2024 07: 44 AM
Slider రంగారెడ్డి

ఎల్లూరు భూనిర్వాసితులకు న్యాయం జరగకపోతే ఉద్యమం

#ellurufarmers

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన ఎల్లూరు గ్రామ భూ నిర్వాసితుల రిలే నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు తెలంగాణ దండోరా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రాము మాదిగ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్లూరు గ్రామ శివారులోని సర్వే నెంబర్లు 371 నుండి 375 వరకు 15 మంది రైతులు భూమి 33 ఎకరాల 27 కుంటల భూమి ఉందని, ఈ భూమికి ఒక ఎకరాకు 20 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

లేకపోతే కలెక్టరేట్ కు, పాదయాత్ర చేస్తామని ఆయన అన్నారు. కొల్లాపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తక్షణమే ఎల్లూరు గ్రామ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజక వర్గం నుండి కలెక్టరేట్ ఆఫీసు దగ్గరికి పాదయాత్ర చేస్తామని మీసాల రాము మాదిగ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా రాష్ట్ర కార్యదర్శి కల్మురి రాములు మాదిగ, నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జి మంతటి గోపి మాదిగ, జిల్లా గౌరవ అధ్యక్షులు డి కె మాదిగ, నాగర్ కర్నూలు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి రాధ, తాలూకా అధ్యక్షులు మల్లెల వెంకట స్వామి మాదిగ, ఈశ్వరయ్య మాదిగ, ఎల్లూరు గ్రామ నిర్వాసితులు, కంటే శివన్న, అహమ్మద్ హుస్సేన్, సత్యం, కంటే రంగన్న, కంటే రఘు, కంటే వెంకటస్వామి, గార్డుల బాలస్వామి, భూ నిర్వాసితుల బాధితుడు తాలూకా జేఏసీ కన్వీనర్, కంటే రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహా ప్రభంజనంలా తెలుగుదేశం మహానాడు

Satyam NEWS

అరేబియా సముద్రంలో బిపర్ జోయ్ తుపాను

Bhavani

పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌కు గ‌ద్ద‌ర్ మ‌ద్ద‌తు

Bhavani

Leave a Comment