33.2 C
Hyderabad
April 25, 2024 23: 23 PM
Slider పశ్చిమగోదావరి

మహిళా పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేసిన సచివాలయాలు

#eluru DIG

సమాజంలో పోలీస్ సేవలు వికేంద్రీకరించి ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించడానికి గ్రామ వార్డ్ సచివాలయాలలో ప్రభుత్వం మహిళా పోలీస్ వ్యవస్థని ప్రజలకు చేరువ చేసిందని ఏలూరు రేంజ్ డి ఐ జి కె మోహన్ రావు అన్నారు.

పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులోని ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్న వార్డ్ సచివాలయాన్ని డి ఐ జి గురువారం ఆకస్మిక పరిశీలన చేశారు. సచివాలయ పరిధిలో విధులు నిర్వహించే ఉమెన్ పోలీస్, వాలంటీర్లు విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు.

వార్డ్ సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు పై ఆరా తీశారు. సచివాలయ రికార్డ్ లను పరిశీలించారు.

రాష్ట్రంలో సుమారు 15 వేల మంది మహిళా పోలీసులు ఎస్ హెచ్ ఓ ల కు అనుసంధానంగా పనిచేస్తున్నారన్నారు. సచివాలయ పోలీస్ వ్యవస్థ  ఏర్పాటు వల్ల ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించే బడతాయని డి ఐ జి చెప్పారు.

ప్రతి చిన్న వివాదాలకు ప్రజలు పోలీస్ స్టేషన్ లకు వెళ్లి విలువైన సమయాన్ని, డబ్బును వృధా చేస్తున్నారని చెప్పారు.

భవిష్యత్ లో మహిళా పోలీస్ ల సేవలు ప్రజలకు మరింత చేరువ చేస్తామని తెలిపారు. ఈ సందర్భం గా డి ఐ జి మోహన్ రావు సచివాలయాలు ద్వారా మహిళా పోలీస్ లు ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు.

Related posts

జగజ్జనని

Satyam NEWS

కాశ్మీర్ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

Satyam NEWS

రైతాంగ పోరాట చరిత్రలో నిలిచిన గుండ్రాపల్లి

Satyam NEWS

Leave a Comment